
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్ కలకలం రేపుతోంది. రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంటూ వీడియో రికార్డ్ చేసింది. తెల్లారిన తరువాత తమ బిడ్డ గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులకొట్టి చూడగా రమ్య ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. తోటి విద్యార్థుల వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, ఫోన్ మెస్సేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని లైవ్ సూసైడ్ నెల్లూరులో సంచలనంగా మారింది.
(చదవండి: అత్యాశకు పోతే 5 కిలోల నకిలీ బంగారం!!)
Comments
Please login to add a commentAdd a comment