రేవంత్రెడ్డి సున్నిత మనస్కుడు: గీత | He is too sensitive,says Revanth reddy wife Geetha | Sakshi
Sakshi News home page

రేవంత్రెడ్డి సున్నిత మనస్కుడు: గీత

Published Tue, Jun 30 2015 12:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

రేవంత్రెడ్డి సున్నిత మనస్కుడు: గీత

రేవంత్రెడ్డి సున్నిత మనస్కుడు: గీత

హైదరాబాద్: టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి ప్రజా సమస్యలపై దూకుడు తగ్గించరని ఆయన భార్య గీత స్పష్టం చేశారు.  ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన రేవంత్రెడ్డికి మంగళవారం హైకోర్టు బెయిల్ మంజురు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో గీత విలేకర్లతో మాట్లాడారు.

తన భర్త రేవంత్కు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకున్నామని కానీ వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయని మాత్రం ఊహించలేదన్నారు. రేవంత్ దూకుడుగా కనిపించిన.. చాలా సున్నితమైన మనిషి అని చెప్పారు. కష్టకాలంలో పార్టీ అధినేతతో సహా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి గీత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తమ వివాహం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా లేరని గీత గుర్తు చేసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్రెడ్డి గత నెలలో తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు బెయిల్ ముంజూరు చేయాలని రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్కు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement