
రేవంత్‌కు టీ టీడీపీ బాధ్యతలు ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి.
ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కలకలం రేపిన పోస్టర్లు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్‌బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు.
దీన్ని గమనించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధులు ఈ పోస్టర్లను చూపిస్తూ తెలంగాణ టీడీపీలో నెలకొన్న లుకలుకలపై వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. టీడీపీ మేలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ. రేవంత్‌రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా కొట్టిపారేశారు.