NTR Trust Bhavan
-
హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చా
సాక్షి, హైదరాబాద్: ‘20 ఏళ్ల క్రితమే విద్యకు పెద్దపీట వేసి ఐటీని అభివృద్ధి చేశా. సైబరాబాద్‌కు నేనే స్వయంగా పేరు పెట్టా. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చా. తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 2,75,853 ఉందంటే ఆనాడు నేను ప్రకటించిన విజన్–2020 వల్లే. నాడు హైటెక్‌సిటీ కట్టకపోతే, నాలెడ్జి సిటీ, ఐఎస్బీ, ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకు రాకపోతే ఈ పరిస్థితి ఉండేదా?’ అంటూ తెలుగు దేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు మరోసారి స్వోత్కర్షకు పోయారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగు పిల్లలు ఉన్నారంటే అది టీడీపీ గొప్పతనమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశానన్నారు. ఐఐటీ, ఐఎస్బీ, ఉర్దూ యూనివర్సిటీ, నల్సార్ యూని వర్సిటీ మొదలైన ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొచ్చినట్లు చెప్పారు. తన నిర్ణయాల వల్ల ఆర్థికంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, అత్యధిక భూముల విలువ లు ఉన్న రాష్ట్రంగా మారిందని పేర్కొ న్నారు. తన నిర్ణయాల వల్లే హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తయారైందన్నారు. నాడు బయో టెక్నాల జీని పరిచయం చేయడం వల్లే నేడు ‘భారత్ బయో టెక్’ కరోనాకు టీకా కనుగొన్నదని చెప్పారు. ఆనాడు పునాది తాను వేస్తే వై.ఎస్., రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ కొనసాగించారన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసూన కంటతడి.. వేదికపై ప్రసంగించే నలుగురు నేతలు మాత్రమే కూర్చోవాలని.. మిగిలిన వారు కిందకు దిగాలని నిర్వాహకులు చెప్పడంతో టీటీడీపీ సీనియర్ నా యకురాలు కాట్రగడ్డ ప్రసూన తీవ్ర ఆవేదన చెందారు. పార్టీలో మిగిలి ఉన్న ముగ్గురు మాజీ ఎమ్మె ల్యేలలో తాను ఒకరినని చెప్పినా వారు వినకపోవ డంతో కంటతడి పెడుతూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. కొందరు నాయకులు తనకు కనీస గౌరవం ఇవ్వ కుండా వేదిక నుంచి కిందకు దింపి అమర్యాదగా వ్యవహరించారంటూ చంద్ర బాబుకు లేఖ పంపి ఆమె ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. టీటీడీపీకి పూర్వవైభవం తెస్తా తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభ వం తీసుకొస్తానని ప్రమా ణ స్వీకారం అనంతరం మా ట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. అంతకు ముందు జూబ్లీ హిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ వరకు ఓపెన్ టాప్ జీపులో చంద్రబాబుతో కలసి ఆయన ర్యాలీగా వచ్చా రు. రెండున్నర గంటలపాటు ర్యాలీ కొనసాగ డంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎన్టీఆర్ భవన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్‌ల ధర్నా టీటీడీపీ అధ్యక్షుడిగా కాసా ని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారానికి తమను తీసుకొచ్చి డబ్బివ్వకుండా వెళ్లిపోయారంటూ దాదాపు 80 మంది సినీ జూనియర్ ఆర్టిస్టు లు ఆందోళన నిర్వహించారు. గంటపాటు సమావేశంలో పాల్గొంటే రూ. 300 చొప్పున ఇస్తామంటూ రాజు, ఆరిఫ్ అనే వ్యక్తులు చెప్పడంతో సాగర్ రింగ్‌రోడ్ ప్రాంతానికి చెందిన సుజాత 80 మందిని ఎన్టీఆర్ భవన్‌కు తీసుకొచ్చింది. సమావేశం అనంతరం రాజు, ఆరిఫ్ పత్తా లేకుండా పోవడం, ఫోన్ సైతం ఎత్తకపోవడంతో వారంతా తొలుత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద, ఆ తర్వాత రోడ్ నంబర్ 14లో ఆందోళనకు దిగారు. టీడీపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీ సులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజుపై వివాదం
-
ఎన్టీఆర్ భవన్ లీజును రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేయాలంటూ ఆ భవన్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట వెలువడిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏకంగా కాల్ సెంటర్లకు భవన్‌లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని, వెంటనే పరిశీలించి లీజును రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతూ ఈ లేఖ రాశారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ లేఖ’పేరిట టీడీపీ రాష్ట్ర కార్యాలయం లెటర్‌ప్యాడ్‌పై బుధవారం రాసిన ఈ లేఖ వివరాల్లోకి వెళితే.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వారి పెత్తనం కొనసాగుతోంది. ట్రస్ట్ భవన్ నిర్వహణ అంతా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. తెలంగాణ నేతలకు పదవి తప్ప పవర్ ఉండదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై అజమాయిషీ ఉండదు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా తమను ట్రస్ట్ భవన్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు. కనీసం ఉద్యోగులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసివేసినా ఎలాంటి ఆధారాల్లేకుండా చేశారు. ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్న ఈ ట్రస్ట్ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. భవన్‌లోని పలు విభాగాలను చంద్రబాబు సిబ్బందికి వసతి గదులుగా వినియోగిస్తున్నారు. ప్రైవేట్ హోటల్, క్యాంటీన్ నడుస్తున్నాయి. ప్రైవేట్ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేసి మాకు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాలి.’అని ఎన్టీఆర్ భవన్ తెలంగాణ ఉద్యోగుల పేరిట విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
Hyderabad: వివాదంలో ఎన్టీఆర్ ట్రస్టుభవన్
-
రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో .. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు. డీజీపీ కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సిటీ బస్సులో కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విచక్షణ కోల్పోయి... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ) రూట్ నంబర్ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్ వద్ద ఓ చానల్ కెమెరామెన్ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్ పిస్టల్ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు... ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి సర్వీస్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ జనాల మధ్య శ్రీనివాస్ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎన్టీఆర్ కారణజన్ముడు
-
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసమ్మతి సెగ తగిలింది. రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ నాయకులకు న్యాయం జరగకపోతే రాజీనామాలకు, ఆత్మహత్యలకు వెనుకాడబోమని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు.. శేరిలింగంపల్లి టికెట్ భవ్యా ఆనంద్ ప్రసాద్‌కు ఇవ్వడంతో నిరసనలు మిన్నంటాయి. ఆమె స్థానంలో మువ్వా సత్యనారాయణకు టికెట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా.. యాదవులకు టిక్కెట్లు ఇవ్వలేదనే కారణంతో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ముందు ఓయూ యాదవ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్థనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. యాదవ, గొల్ల కురుమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డబ్బులు తీసుకుని టిక్కెట్లను అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. -
అశ్లీల వీడియోలపై మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం
-
వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో
-
వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో
పోస్ట్ చేసిన నంద్యాల టీడీపీ నేత.. మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం నంద్యాల: గౌరవ ప్రదమైన హోదా, రాజకీయ అనుభవం, ఐదు పదుల వయస్సు దాటిన ఓ టీడీపీ నేత బుద్ధి వక్రీకరించింది. అధికార పార్టీలో గుర్తింపు కలిగిన ఈ నేతకు వ్యాపార పరంగా, కౌన్సిల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ గుర్తింపు ఉంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈయన రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులో ఓ యువతి నగ్నంగా నృత్యం చేస్తున్న అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. ఈ గ్రూపులో మున్సిపల్ చైర్పర్సన్ సహా మహిళా కౌన్సిలర్లు ఉండటంతో మంగళవారం వీరంతా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాట్సాప్ నంబర్లకు, ఈ–మెయిల్స్‌కు ఫిర్యాదు చేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విభజన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను విభజించి.. ఒకటి, రెండో అంతస్తులను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి (టీటీడీపీ) కేటాయించారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సైకిల్‌పై ర్యాలీగా వచ్చి టీటీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. చెత్తనగరంగా మార్చిందని విమర్శించారు. బీసీలు, మహిళలు, యువత, రైతులు, దళితులు, గిరిజనులకు టీడీపీ వేదికగా వుంటుందని.. టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేరలేదన్నారు. కేసీఆర్ అభివృద్ది త్రీడీ సినిమాలు, ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించే వేదికగా టీడీపీ నిలుస్తుందని.. చంద్రబాబు మార్గదర్శకత్వంలో పార్టీకి తెలంగాణకు పూర్వ వైభవం తెస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు టీడీపీ కృషి చేసిందని పార్టీ అధ్యక్షుడు రమణ అన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల ఖర్చు చేసామని చెప్తున్నా.. ఏ వర్గం సంక్షేమానికి ఖర్చు చేసిందో తెలియడం లేదన్నారు. ఈ సందర్భంగా జూబ్లిహిల్స్‌కు చెందిన ప్రదీప్ చౌదరి టీడీపీలో చేరగా.. రమణ, రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడైన ప్రదీప్ చౌదరి గతంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరూ టీఆర్ఎస్లో ఇమడలేక పోతున్నారని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ప్రదీప్ చౌదరి ఆరోపించారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎలా మద్ధతు ఇస్తాడంటూ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు, మాలమహానాడు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు మాలమహానాడు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
-
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..
హైదరాబాద్: మరోసారి టీఆర్ఎస్ టీడీపీ మధ్య ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుచిత వ్యాఖ్యలు అన్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. వారిని టీడీపీ వాళ్లు అడ్డుకోవడంతో భవన్ ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వృత్తి విద్యా శిక్షణ కేంద్రం!
- తొలుత మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని యోచన - తెలంగాణ ప్రభుత్వం నుంచి రాని అనుమతులు - వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఏర్పాటుకే మొగ్గు సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో త్వరలో వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇక్కడ తొలుత మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే తగినంత స్థలంతోపాటు క్రీడామైదానం లేకపోవడంతో అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున గోకుల్ పేరుతో ఉన్న ఓ డిగ్రీ కళాశాలను కొనుగోలు చేశారు. ఆ కళాశాలను ప్రస్తుతమున్న చిరునామా నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోకి మార్చడంతోపాటు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశారు. ఇదే విషయమై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ దరఖాస్తు చేసింది. అయితే వారినుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతులు రాలేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా ట్రస్ట్ వర్గాలు నిర్ణయించాయి. బాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు ఎన్టీఆర్ ట్రస్ట్‌కు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగా ఉన్న స్థలం కావాలని అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్‌జాన్ బాషా ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో ఆగమేఘాల మీద స్థలం లీజుకు కేటాయించారు. అనుమతులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ స్థలంలో రెండు భవనాలున్నాయి. ఒక భవనంలో టీడీపీ కేంద్ర, ఏపీ, తెలంగాణ రాష్ర్ట కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయానికి అనుబంధంగా మెస్, గ్రంథాలయం, సమాచార కేంద్రం, డార్మిటరీలతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం రెండో భవనంలో నడుస్తున్నాయి. టీడీపీ కేంద్ర, ఏపీ కార్యాలయాలు, అనుబంధంగా ఉన్న గ్రంథాలయం, సమాచార కేంద్రం, కార్యక్రమాల కమిటీ తదితరాలు గుంటూరు తరలిపోవడంతో భవనం దాదాపు ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ కళాశాల ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారాయణ విద్యాసంస్థల పర్యవేక్షణలో గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మిస్తున్నారు. దానికి కొనసాగింపుగానే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని భావించారు. అనుమతి రాకపోవడంతో ప్రస్తుతం ఆ ఆలోచనకు బ్రేక్ పడింది. వృత్తి విద్యా శిక్షణ కేంద్రం తెరపైకి వచ్చింది. ట్రస్ట్ కోసం తీసుకున్న స్థలంలో సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఎవరికీ దీర్ఘకాలం అద్దెకు ఇవ్వకూడదు. -
పాలకులకు గడ్డుకాలమే
టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం సాక్షి, హైదరాబాద్: పాలకులకు ఈ ఏడా ది గడ్డుకాలమేనని ప్రముఖ పండితుడు శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన శ్రీ దుర్ముఖి నామ ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. వృశ్చిక రాశిలో కుజుడు, శని కలసి ఉంటాయని, అందువల్ల పాలకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అప్రియమైన మాటలు మాట్లాడేవారిని దుర్ముఖులుగా పేర్కొంటారని, అందుకే ఆచితూచి వ్యవహరించాలన్నారు. సంవత్సర అధిపతి రుద్రుడు కాబట్టి మంచిచేసే వారికి మంచి జరుగుతుందన్నారు. వర్షాలు కురిసి పాడిపంటలు బాగుంటాయన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని ఆరాధించాలని శంకరమంచి శివసాయి శ్రీని వాస్ వివరించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అమరనాథ్ బాబు పాల్గొన్నారు. -
'టీడీపీ ఆవిర్భావం ఓ చరిత్ర'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓ చరిత్ర అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ 35వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు ఎగురవేసి... కేక్ కట్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులు... కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామన్నారు. అన్ని సమస్యలను తట్టుకుని పార్టీ నిలబడిందంటే అందుకు కార్యకర్తలే కారణమన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు చేరుకుని.... ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆవిర్భావ వేడుకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేటి సాయంత్రం 5.00 గంటలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. -
ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
-
ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
హైదరాబాద్: టీడీపీ-బీజేపీ పొత్తు టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఈ పొత్తును తీవ్రంగా వ్యతి రేకిస్తూ తెలుగు తమ్ముళ్లు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ తమపై సవతితల్లి ప్రేమ చూపిందని ఆగ్రహిస్తూ బైఠాయించారు. గెలిచే సీట్లను తమకివ్వకుండా ఒంటెత్తు పోకడ పోయిందన్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీట్ల పంపకంపై జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లోని టీడీపీకి చెంది న కేంద్ర మంత్రి సుజనాచౌదరి కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి, సుజనాచౌదరి, ఎమ్మెల్యే వివేకానంద్ సమావేశమైనట్టు తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి కూడా వెళ్లి ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ బైఠాయించారు. పూలకుండీలు ఎత్తి పడేశారు. ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిం దని నినాదాలు చేస్తూ నేతలను ఘెరావ్‌కు యత్నించారు. బీజేపీతో పొత్తు తెంచుకోకపోతే గ్రేటర్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యనే సుజనా చౌదరితో పాటు బీజేపీ, టీడీపీ నేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిందని జూబ్లీహిల్స్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వర్రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను బీజేపీకి కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అక్కడినుంచి రెబల్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల సీఎం కేసీఆర్ వద్ద రూ.50 కోట్లు ముడుపులు తీసుకొని నగరమంతటా వారి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టారని ఆరోపించారు. జంటనగరాల్లో టీడీపీ లేకుండా చేయడానికే బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్నారు. -
టీడీపీకి 87, బీజేపీకి 63
తేలిన జీహెచ్ఎంసీ సీట్ల సర్దుబాటు లెక్కలు * ‘గెలుపు’ సీట్లపై పంతం నెగ్గించుకున్న బీజేపీ * టీడీపీ సిట్టింగ్ సీట్లనూ సొంతం చేసుకున్న వైనం * భగ్గుమన్న టీడీపీ శ్రేణులు.. * ఎన్టీఆర్ ట్రస్ట్భవన్, సుజనా కార్యాలయాల వద్ద ఆందోళన * బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీ మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల తుదిగడువు ముగిసేందుకు మరికొద్ది గంటల సమయమే ఉండగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి సీట్ల లెక్కలు తేలాయి. మూడు రోజులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన అనంతరం... టీడీపీ 87, బీజేపీ 63 సీట్లలో పోటీ చేయాలని ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చారు. శనివారం అర్ధరాత్రి దాకా పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నా పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాటపడుతున్న టీడీపీ ప్రతిపాదనలకు కమలనాథులు ఒప్పుకొంటూనే ‘మంచి’ సీట్లకు గురిపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నియోజకవర్గాల్లో మెజారిటీ డివిజన్లతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న సీట్లను పొందేందుకు బీజేపీ నేతలు చివరి వరకు ప్రయత్నించారు. 2009లో టీడీపీ గెలిచిన 45 సీట్లు మినహాయించి మిగతా సీట్లను పంచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినప్పటికీ... అందులో 10 సీట్ల వరకు బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. ఈ విషయం శనివారం సాయంత్రానికే బయటకు పొక్కడంతో ఆయా డివిజన్లకు చెందిన టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. సుజనా చౌదరి కార్యాలయం వద్ద కూడా టీడీపీ అసంతృప్తుల నినాదాలతో గందరగోళం నెలకొంది. టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బి.వె ంకటరెడ్డి తదితరులు రాత్రి వరకు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతూనే ఉన్నారు. బలమున్న సీట్లపై బీజేపీ టార్గెట్.. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లకు గాను 63 చోట్ల పోటీకి ఒప్పుకొన్న బీజేపీ... అందులో తమకు బలమున్న సీట్లను పొందేందుకు తీవ్రంగా పోరాడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేటలో 5 డివిజన్లు ఉండగా ఒక్క నల్లకుంట సీటును మాత్రమే టీడీపీకి కేటాయించినట్లు సమాచారం. చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న హిమాయత్‌నగర్‌తో పాటు నాలుగు సీట్లు బీజేపీ తీసుకుంది. సోమాజిగూడ డివిజన్‌ను మాత్రమే టీడీపీకి ఇచ్చేందుకు చింతల ఒప్పుకున్నారు. చివరికి జూబ్లీహిల్స్ సీటును సుభాష్‌రెడ్డి అనే నాయకుడికి ఇవ్వాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ద్వారా టీడీపీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఫోన్ చేయిస్తే... దానిని బీజేపీకి కేటాయించేసినట్లు సమాధానమిచ్చే పరిస్థితి. ముషీరాబాద్ నియోజకవర్గంలో రెండు సీట్లు మాత్రమే టీడీపీకి కేటాయించారు. ఇక సెటిలర్లు ఉన్న చోట తమకు ఓట్లు వస్తాయని ఆశ పెట్టుకున్న టీడీపీ నేతలు... అక్కడ కూడా ముఖ్యమైన సీట్లను బీజేపీ సొంతం చేసుకుందని చెబుతున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్‌తో పాటు సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి దెబ్బతగిలింది. సికింద్రాబాద్‌లోని జనరల్ సీట్లన్నీ బీజేపీ తీసుకుని రిజర్వుడ్ సీట్లను టీడీపీకి వదిలేసింది. అమీర్‌పేట, సనత్‌నగర్ సీట్లను బీజేపీకి కేటాయించడంపై ఇద్దరు మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ప్రభావం ఉన్న చోట టీడీపీకి? తక్కువ సీట్లలో పోటీకి ఒప్పుకున్న బీజేపీ నేతలు సీట్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని మెజారిటీ సీట్లను తీసుకున్న బీజేపీ నాయకులు... నగర శివార్లలోని సీట్లలో కూడా 40:60 ప్రాతిపదికన పోటీ చేసేం దుకు ఆసక్తి చూపారు. శివార్లలోని తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోవడంతో... టీడీపీ నేతలు కూడా వాటిపై పెద్దగా పట్టు పట్టలేదని తెలిసింది. ఇక ఎంఐఎం ప్రభావం అధికంగా ఉన్న మలక్‌పేట, నాంపల్లి, బహుదూర్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్ మొదలైన చోట్ల సగం కన్నా ఎక్కువ సీట్లు టీడీపీకే అప్పగించినట్లు ఓ నాయకుడు తెలిపారు. నేడు బీజేపీ జాబితా సాక్షి, హైదరాబాద్: టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని శని వారం అర్ధరాత్రి దాకా సాగిన చర్చల అనంతరం బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రకటించారు. టీడీపీ 87 స్థానాల్లో, బీజేపీ 63 స్థానాల్లో బరిలోకి దిగుతున్నట్టు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు. తాము పోటీ చేసే 63 డివిజన్లలో అభ్యర్థుల వివరాలను ఆదివారం ప్రకటిస్తామన్నారు. టీడీపీ 90, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత అంగీకారానికి వచ్చినా, అందుకు బీజేపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో టీడీపీతో మరోసారి సమావేశమై 87-63కు అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు. చింతలతో మాగంటి వాగ్వాదం కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం రాత్రి వరకు జరిగిన చర్చల సందర్భంగా ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. హిమాయత్‌నగర్ సిట్టింగ్ సీటును తీసుకోవడం, టీడీపీ బలంగా ఉన్న జూబ్లీహిల్స్‌తోపాటు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ తీసుకోవడంపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు మేలు చేసేందుకే బీజేపీ నాయకులు సీట్ల కోసం పట్టుపడుతున్నారని ఆరోపిస్తూ... ఆయన సుజనా చౌదరి ఆఫీస్ నుంచి రాత్రి 8 గంటలకు తన కార్యాలయానికి వెళ్లిపోయారు. బీజేపీ విధానం వల్ల అధికార పార్టీకి మేలు జరుగుతుందంటూ... తాను బీజేపీతో కలసి ప్రచారంలో కూడా పాల్గొనని స్పష్టం చేశారు. టీడీపీ అసంతృప్తులు రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసినా తనకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆయనెవరు?
ఆయనెవరు?... ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. గత ఏడాదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధికారం చేపట్టింది. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారానికంటే ముందే గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుగానే నిర్ణయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పోటీ పడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎకరాల కొద్ది భూమిని తమతో పాటు బంధువులు, అనుచరుల పేర్లమీద రైతుల నుంచి పదో పరకో చెల్లించి కొనేశారు. అయితే పార్టీ ప్రముఖుడు ఒకరు వీరందరి బాటలో నడవలేదట. రాజధానిలో భూములు కొనటం కంటే ఇతర ప్రాంతాల్లో దృష్టి సారించటం బెటరని భావించారట. అలా అనుకున్నదే తడవుగా ఖండాలు దాటి భూములు కొనుగోలు, అమ్మకాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారట. అందులో భాగంగా ఆస్ట్రేలియాలో ఒకేసారి నాలుగొందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. ఆ భూమి విలువ సుమారు ఆరొందల కోట్లు ఉంటుందట. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంత పెద్ద మొత్తం వెచ్చించి ఆయన భూములు కొనుగోలు చేసిన విషయం మెల్లగా బయటకు పొక్కింది. అయితే పార్టీ ముఖ్యులకు మాత్రమే ఈ విషయం తెలియటంతో వారు ఇదే విషయాన్ని నెమ్మదిగా తమ అలవాటులో భాగంగా లీక్ చేశారు. అయితే ఆయన పేరు మాత్రం బైటకు చెప్పలేదు. ఆయన జిల్లా పేరు మాత్రం వెల్లడించారు. దీంతో ఇంతకు ఆ నేత ఎవరంటూ పార్టీ నేతలు ఎన్టీఆర్ భవన్లో చర్చించుకుంటున్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్
-
అంతా అధినేత తీరే..!
తెలుగు తమ్ముళ్ల సైకిల్ యాత్ర తీరు హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని గురించి ఊరూవాడా ప్రచారం చేయాలని కొందరు తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ‘ఏపీ కేపిటల్ రైడ్’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా పార్టీ అధినేత మెప్పు పొందాలనుకున్నారు. మోకాళ్లు, మోచేతులకు రక్షణ కవచాలు (గార్డ్స్), కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లతో సిద్ధమయ్యారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అరికెపూడి గాంధీ, మాగంటి బాబు జెండా ఊపి సైకిల్ యాత్ర ప్రారంభించారు. అంతే రాజధాని దిశగా తమ్ముళ్లు రయ్.. మంటూ దూసుకుపోయారు. తమ్ముళ్ల స్పీడ్ చూసి నేతలు మహా ముచ్చటపడిపోయారు. కానీ ర్యాలీ నగర శివారు చేరుకున్నాక అసలు కథ మొదలయ్యింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లారీలోకి సైకిళ్లు ఎక్కించిన తెలుగు తమ్ముళ్లు తాము ఆ పక్కనే ఉన్న ఏసీ బస్సు ఎక్కి కూర్చున్నారు. ముందు బస్సు.. దాని వెనుకే లారీ. ఏదైనా ఊరు సమీపించగానే బస్సులోంచి దిగి సైకిలెక్కడం.. ఊరు దాటగానే సైకిళ్లు లారీలో వేసి ఏసీ బస్సులో సేద తీరడం.. ఇదీ తమ్ముళ్ల సైకిల్ ర్యాలీ కొనసాగిన తీరు. ఈ డ్రామా గమనించిన కొందరు ముక్కున వేలేసుకోగా.. మరికొందరు డ్రామాలో తమ్ముళ్లు తమ నేతనే మించిపోయారంటూ వ్యాఖ్యానించారు. -
లోకేష్‌పై జేసీ గరంగరం
-
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సాక్షిగా జేసీకి అవమానం
హైదరాబాద్: టీడీపీ యువనేత లోకేష్‌ను కలవడానికి వెళ్లిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తీవ్ర అవమానం జరిగింది. నియోజక వర్గ పనులకు సంబంధించి మంగళవారం లోకేష్‌ను కలవడానికి వెళ్లిన జేసీ.... ముందుగా చిన్నబాబు అపాయింట్మెంట్ తీసుకోలేదనే కారణంతో వెనుదిరగాల్సి వచ్చింది. లోకేష్‌ను కలవడానికి గంటసేపు వేచి చూసి చివరకు లోకేష్ బిజిగా ఉన్నారని పీఏ తెలపడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంగా పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. సీనియర్ నాయకులమైనా తమకు పార్టీలో ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ జేసీ ప్రశ్నించారు. సీఎం దగ్గరకు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా తాము వెళ్లిన సందర్బాలున్నాయని ఆయన గుర్తు చేశారు. సీనియర్లమైనా తమకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా లోకేష్ బాధితుల్లో ఒక్క జేసీనే కాదని... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఉన్నారనే పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే జేసీకి... లోకేష్ సమయం ఇవ్వకపోవడానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడుపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలే కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని జేసీ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అవుట్‌డేట్ నాయకుడని జేసీ మీడియా ముందు కుండబద్దల కొట్టినట్లు చెప్పటంతో...చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలో బాగంగానే లోకేష్ జేసీని కలవడానికి ఇష్టపడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోచింగ్!
-
మీడియాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
-
మీడియాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద మీడియా ప్రతినిధులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణం నుంచి లైవ్‌లు ఇవ్వొద్దంటూ వాళ్లు మీడియాను అడ్డుకున్నారు. చంద్రబాబుతో పాటు మరికొందరికి కూడా తెలంగాణ ఏసీబీ వర్గాలు నోటీసులు ఇవ్వొచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలను వివరించేందుకు, టీడీపీ నాయకుల స్పందనలను తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి ఎలాంటి ప్రత్యక్ష ప్రసారాలు చేయద్దని కార్యకర్తలు వాళ్లు అడ్డు తగిలారు. -
ఆ అరకోటి అక్కడి నుంచి తెచ్చిందే..
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సే రేవంత్ రెడ్డి తెచ్చిన రూ.50 లక్షల నగదు ఎక్కడిది, ఆయనకు అందించింది ఎవరన్న అంశాలపై ఏసీబీ అధికారులు కూపీ లాగిన కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు సమీపంలోని ఒక బ్యాంకు బ్రాంచీ నుంచి ఆ సొమ్మును డ్రా చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అంత భారీ మొత్తంలో నగదు ఎవరి ఖాతాలో ఉంది, ఎవరు డ్రా చేశారన్న దిశగా లావాదేవీల పూర్వాపరాలను రాబట్టేందుకు ఏసీబీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ట్రస్ట్ భవన్‌కు అత్యంత సమీపంలోనే ఈ నగదు లావాదేవీలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రేవంత్‌రెడ్డి సెల్‌ఫోన్, ఉపయోగించిన సిమ్‌కార్డులు, కాల్‌డేటా ఆధారంగా ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందనేదానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. రేవంత్‌తో ఫోన్ సంభాషణలకు సంబంధించి 13 నంబర్లను అనుమానాస్పదంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నంబర్ల ఆధారంగా వారి ఆచూకీ కనుక్కోవడంతో పాటు ఇప్పటికే అందులో కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ సినీ నిర్మాతను కూడా ఏసీబీ విచారించే అవకాశమున్నట్లు సమాచారం. వివరాలు లీక్ కాకుండా ఈ కేసు విచారణను కొద్దిమంది అధికారులతోనే నిర్వహిస్తున్నారు. -
కేసీఆర్‌పై టీడీపీ చార్జిషీటు
ప్రజాస్వామ్యాన్ని దగా చేశారు: ఎర్రబెల్లి, రావుల హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని టీడీపీ విమర్శించింది. ఏడాది పాటు కేసీఆర్ అస్తవ్యస్త పాలన, అప్రజాస్వామిక విధానాలపై ప్రజల తరఫున చార్జిషీటు విడుదల చేసినట్లు ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోవడం, నిరంకుశ పరిపాలన, రాజకీయంగా అనైతిక అక్రమాలు వంటి అంశాలతో చార్జిషీటు రూపొందించామన్నారు. కేసీఆర్ పాలన పూర్తిగా ఆపరేషన్ ఆకర్ష్‌గా నడిచిందని, భూములను అమ్మి సొంత వారికి కట్టబెట్టే ప్రక్రియ సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా దగా చేశారని మండిపడ్డారు. రేవంత్‌ను పరామర్శించిన నేతలు: ఓటుకు నోటు స్కాంలో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ నాయకులు కలిసి పరామర్శించారు. పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు రేవంత్‌తో మాట్లాడారు. -
వర్గీకరణపై చంద్రబాబు స్పందించాలి
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నం - ఎమ్మార్పీఎస్ నాయకుల అరెస్ట్ బంజారాహిల్స్ : మహానాడులో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీను నాయకత్వంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి ట్రస్ట్ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇప్పటికైనా స్పందించకుంటే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్ నాయకులు దండు సురేందర్, చింత ప్రభాకర్, నాగారం బాబు, కనకరాజు, మంచాల యాదగిరి, అంజయ్యతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చిక్కడపల్లి : వర్గీకరణకు సహకరించకుండా ఎస్సీలను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేశాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్ను కనకరాజు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబునాయడు దిష్టిబొమ్మను బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దహనం చేశారు. అనంతరం కనకరాజు మాట్లాడుతూ.. మహనాడు సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కె.మురళి, లక్ష్మణ్, సాయిలు, మంచాల యాదగిరి పాల్గొన్నారు. ఓయూలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఏపీ సీఎం చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మను బుధవారం మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు చంద్రబాబునాయుడి పై నిప్పులు కక్కిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ, మహానాడు జరుగుతున్న నేపథ్యంలో స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో అలెగ్జాండర్, కొల్లూరి వెంకట్, కొంగరి శంకర్, నర్సింహ్మ, నగేష్, రమేష్, తిరుపతి, పిడుగు మంజుల పాల్గొన్నారు. -
మాలెక్క తేల్చండి
-
తెలుగు తమ్ముళ్ల ‘అధ్యక్ష’ లొల్లి
12న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక బిల్యాను తప్పించాలని ఉమామాధవరెడ్డి వర్గీయుల పట్టు ప్రస్తుత అధ్యక్షుడికి అండగా మోత్కుపల్లి రమేశ్‌రాథోడ్ రూపంలో బిల్యానాయక్‌కు పదవీగండం! తనకే మళ్లీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ధీమాలో బిల్యా అధినేత బాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రూపు తగాదాలు, మాటల తూటాలకు పుట్టినిల్లయిన జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన సారథి ఎవరనే అంశంలో లొల్లి మొదలైంది. ఈనెల 12వ తేదీన జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్నే పదవిలో కొనసాగిస్తారా? లేక కొత్త నేతను ఎంపిక చేస్తారా అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే, సామాజిక వర్గాల కోటాలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ పార్లమెంటు సభ్యుడు రమేశ్‌రాథోడ్‌కు అప్పగించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని, అదే జరిగితే రాథోడ్ సామాజిక వర్గానికే చెందిన బిల్యానాయక్‌ను తప్పించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఉమామాధవరెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు ఆయనను తప్పించాల్సిందేనని అంటుండగా, మోత్కుపల్లి మాత్రం బిల్యానే కొనసాగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. బిల్యాకు సమాన అవకాశాలు సామాజిక వర్గాల కోటాలో బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థాయిలో జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మళ్లీ నల్లగొండ జిల్లాలో అదే సామాజిక వర్గానికి బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని పార్టీ నాయకులంటున్నారు. అయితే, జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న ఉమామాధవరెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఆమె ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చకపోయినా, ఆమె వర్గంలో ఉన్న నాయకులు మాత్రం బిల్యాను తప్పించాలని, అవసరమైతే ఎస్టీ సామాజిక వర్గంలోనే మరో వ్యక్తికి ఇవ్వాలి తప్ప బిల్యాకు వద్దని అంటున్నారు. దీనికి మోత్కుపల్లి మాత్రం ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్యాను కొనసాగించాల్సిందేనని ఆయన అధినేత చంద్రబాబు వద్ద స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నేతల కొట్లాట ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది. కాగా, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాల మధ్య గొడవలు కూడా బిల్యాకు సానుకూలంగా మారుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ బిల్యాను తప్పించాలనుకుంటే ఏకగ్రీవంగా మరొకరి పేరు సూచించే పరిస్థితి జిల్లా పార్టీలో లేదు. అది ఎస్టీ సామాజిక వర్గమైనా, మరే ఇతర సామాజిక వర్గమైనా ఒక్క నాయకుడి పేరు మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బిల్యా మాత్రం తనకే మళ్లీ అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తనను పిలిచి పదవి ఇచ్చారని, ఇప్పుడే అదే జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీకి వెళ్లనని, ఏకగ్రీవంగా ఇస్తేనే పదవిని తీసుకుంటానని ఆయన సన్నిహితుల వద్ద అంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల సమావేశాల్లో జాప్యం వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఎక్కడా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో 12వ తేదీనాటికే ఈ సమావేశాలన్నీ పూర్తవుతాయా అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అధ్యక్ష పదవికి 12వ తేదీన ఎన్నిక జరగాలని, జిల్లా మినీ మహానాడు ఈనెల 18న నిర్వహించాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గాల సమావేశాలన్నీ పూర్తవుతాయని, 12న జిల్లా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని జిల్లా టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తమ్ముళ్ల తగువులు ఏమవుతాయో? జిల్లాలో తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి గ్రూపులుగా పార్టీ నేతలు విడిపోయారు. గత ఎన్నికలకు ముందు ఇరువర్గాలు ఢీఅంటే ఢీ అనగా, ఎన్నికల అనంతరం మోత్కుపల్లి శిబిరంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌తో పాటు ఇతర నేతలంతా ఉమామాధవరెడ్డి పక్షాన చేరారు. సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్మ్రేశ్రెడ్డి మాత్రం మోత్కుపల్లి వెంటే ఉన్నారు. గత ఎన్నికలలో మోత్కుపల్లి కూడా జిల్లా నుంచి వలస వెళ్లి ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో పార్టీ నేతలంతా ఆయనపై తిరుగుబాటే ప్రకటించారు. జిల్లాలో కీలకంగా ఉన్న నాయకుడే జిల్లా వదిలి వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమయిందనే భావనలో కొందరు నేతలున్నారు. అసలు జిల్లాతో మోత్కుపల్లికి సంబంధమే లేదనే స్థాయిలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో గుంభనంగా వ్యవహరించిన మోత్కుపల్లి అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో జిల్లా పార్టీలో తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్యాను మార్చి వేరే నేతను ఎంపిక చేయాలనుకుంటే ఏ సామాజిక వర్గమైన గొడవలు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికే వలసలు ఎక్కువయి డీలా పడిపోయిన పార్టీకి త్వరలోనే జరగనున్న జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే. -
రేవంత్‌కు టీ టీడీపీ బాధ్యతలు ?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలకలం రేపిన పోస్టర్లు హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్‌బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని గమనించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధులు ఈ పోస్టర్లను చూపిస్తూ తెలంగాణ టీడీపీలో నెలకొన్న లుకలుకలపై వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. టీడీపీ మేలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ. రేవంత్‌రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా కొట్టిపారేశారు. -
నేడు చంద్రబాబు పాలమూరు పర్యటన
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను ఆ పార్టీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. తిమ్మాపూర్, షాద్‌నగర్, జడ్చర్ల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. 3.30 గంటలకు సభను ముగిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తెచ్చిన 65 కిలోల కేక్‌ను అభిమానులు కట్ చేశారు. రక్తదానం, నేత్రదానం క్యాంపులను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కాగా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం తపించిన మహానేత అంబేడ్కర్ అని వారు కొనియాడారు. దళిత, వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. అనంతరం వారు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, పార్టీ నేతలు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, సారంగపాణి, నైషదం సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు నిరుద్యోగుల ధర్నా
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక సభ్యులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ట్రస్ట్భవన్ ముట్టడికి యత్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు... కానీ ఆ తర్వాత బాబు వచ్చాడు జాబు పోయింది అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రస్ట్ భవన్ ముందు బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అనే హామీని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు వీరిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్.గోవిందరావు, పలువురు నేతలు, నిరుద్యోగులు ఉన్నారు. -
మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాదిగలను అంటరానివారిగా చూస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దొరతనంతో ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను బర్తరఫ్ చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా ఎస్సీలను తొక్కిపట్టిన కేసీఆర్ ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను జీర్ణించుకోలేక ఆయనపై రుసరుసలాడుతూ చివరికి బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కులవివక్షత ఎక్కడో లేదని కేసీఆర్ వద్దే అది కనిపిస్తోందన్నారు. వరంగల్ సభలో తనకన్నా ముందే హెల్త్ యూనివర్సిటీపై రాజయ్య ప్రకటన చేసినప్పటి నుంచి ఆయనను మందలించడం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ ఉంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. -
పక్కదారి పట్టించేందుకే బాబుపై ఏడుపు: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్నుంచి ప్రజల దృష్టిని పక్కదారిపట్టించేందుకేసాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ సమస్యపై ఏపీ తప్పుందని తేలితే కేంద్రం వద్దకు వెళ్దామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై నెపం పెడితే ప్రజలు సహించరన్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన తలసాని, తుమ్మలను టీఆర్ఎస్లో చేర్చుకొని మంత్రిపదవులు ఇవ్వడంతో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ప్రశ్నించారు. -
లోకేశ్ అధికారిక సమీక్ష!
ధాన్యం సేకరణ, మద్దతు ధరపై సమావేశం.. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో తెరపైకి.. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన తనయుడు లోకేశ్ అధికారిక కార్యక్రమాలను సమీక్షించారు. అదీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరైన సమావేశంలో ధాన్యం సేకరణ, మద్దతు ధర అంశాలపై సమీక్ష జరిపారు. మంగళవారం నిర్వహించే ఈ సమావేశానికి రావాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించినా వారు నిరాకరించారు. మంత్రులు సచివాలయంలోని తమ చాంబర్లో సమావేశం నిర్వహిస్తే తాము వచ్చి ధాన్యం సేకరణ, మద్దతు ధరపై వివరాలు ఇస్తామని, అది తమ బాధ్యత అని, అందులో ఎవరు పాల్గొంటారన్నది తమకు అనవసరమని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కాగిత వెంకట్రావు, తోట త్రిమూర్తులు, కురుకొండ రామకృష్ణ, కొమ్మాలపాటి శ్రీధర్, బోడే ప్రసాద్, ఎన్.రామానాయుడు, గుండా లక్ష్మీదేవి, పార్టీ నేతలు టీడీ జనార్దనరావు, వి.జయరామిరెడ్డి, వీవీవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం సంద ర్భంగా.. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర రాకపోవటం, సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావనకొచ్చాయి. రైతుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు, పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నానని, వారు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మంగళవారం తెల్లవారుజామున ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన నేపథ్యంలో.. ఇప్పుడు అదే కమిటీతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ధాన్యం సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. భారీ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో పండిన పంటలో చాలా భాగం ఇంకా రైతుల వద్దే ఉందని తెలిపారు. కాగా లోకేశ్ ధాన్యం సేకరణకు సంబంధించి పార్టీ కార్యకర్తలు, రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని సమావేశంలో ప్రస్తావించారు. -
పార్టీని మీరే కాపాడాలి..
చంద్రబాబుకు టీడీపీ తెలంగాణ నేతల వేడుకోలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యతను నేతలు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకే వదిలేశారు. ఏరోజు ఏ నాయకుడు టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడాలంటే ఇక్కడి పది జిల్లాల మీద కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమైక్యవాదులుగా పేరు పొంది... కేసీఆర్‌ను బహిరంగంగా తిట్టిన నాయకులను కూడా టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రులను చేస్తూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలా తెలంగాణలో తెలుగుదేశం ఉండదనే సంకేతాలను పంపిస్తుండడంతో టీడీపీ ఖాళీ అవుతోందని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. కొందరు నాయకులు పోయినా ప్రజల్లో ఇంకా టీడీపీ మీద అభిమానం ఉందని, కేసీఆర్ మైండ్‌గేమ్‌కు లొంగవద్దని నేతలకు చంద్ర బాబు సూచించారు. పదిరోజులకోసారి తెలంగాణలోని ఒక్కో జిల్లాలో పర్యటిస్తానని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారిలో ధైర్యాన్ని నింపుతానని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్ నుంచి ఈ పర్యటన ప్రారంభించే అవకాశం ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య చంద్రబాబుతో జరిగిన ఈ సమావేశానికి హాజరు కాలేదు. టీఆర్ఎస్లోకి టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సహా విద్యార్థి, యువ నేతలు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద వారు సమావేశమయ్యారు. చంద్రబాబు విధానాలకు నిరసనగా పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించారు. -
'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్'
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ ఆశయసాధన కోసం కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆ మహానటుడు వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లోక్ష్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఆశయాలు ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ చేస్తున్న పనులకు పొంతనే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ భవన్లో జరిగేదంతా..బిజినెస్సే: తలసాని
హైదరాబాద్ : టీడీపీపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రంగా మారందని...అక్కడ జరిగేదంతా బిజినెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ముందు సామాజిక తెలంగాణ, బీసీ సీఎం అని తెరమీదకు తెచ్చిన టీడీపీ... రెండు రాష్ట్రాల్లో బీసీలకు ఇచ్చింది 58 సీట్లేనని ఆరోపించారు. బీసీ సీఎం అని పార్టీలో చేర్చుకున్న ఆర్.కృష్ణయ్యకు కనీసం ప్లోర్ లీడర్ పదవి కూడా ఇవ్వలేదని తలసాని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకూ ఇక్కడే ఉంటానన్న చంద్రబాబు.... మరి కేంద్ర మంత్రిపదవి మాత్రం తెలంగాణ వారికి ఎందుకు ఇప్పించలేదని అన్నారు. దేవెగౌడను ప్రధాని చేశానంటున్న చంద్రబాబు...ఎన్టీఆర్‌కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారని తలసాని సూటిగా ప్రశ్నించారు.ఆర్టీఐ చట్టం ఆసరాగా టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని తలసాని ఆరోపించారు. సొంత పారట్ఈ మనుషుల నుంచే డబ్బులు వసూలు చేశారని ఆయన అన్నారు. మైహోం రామేశ్వరరావు నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తలసాని తెలిపారు. -
ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలుగుదేశం తరపున ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఇటీవల బస్సుయాత్ర ద్వారా పరామర్శించామని, వారి ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన పార్టీ నేతలు ఎర్రబెల్లి ద యాకర్ రావు, పి.రాములుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రూ. 2 కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిధికి దాతల నుంచి విరాళాలు సేకరిస్తామని, తెలంగాణ రైతుల కోసం ఎవరైనా సాయం చే యవచ్చని పేర్కొన్నారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి ఈ నిధి ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జాబ్‌మేళా!
480 ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగులు తెలుగుదేశం కార్యకర్తల కోసం లోకేష్ మంత్రాంగం హైదరాబాద్: మెరికల్లాంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఫార్మా, బీపీవో తదితర కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం పరిపాటి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీ క్యాంపస్‌లూ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లకు వేదికలవుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నారాలోకేష్ నేతృత్వంలో శనివారం ఏడు జాతీయ స్థాయి కంపెనీలు 480 ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించాయి. తద్వారా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల కుటుంబాలకు చెందిన పిల్లలను ట్రస్ట్భవన్ నుంచే కంపెనీల్లోకి పంపించే ఏర్పాట్లు చేశారు. హెటెరోడ్రగ్స్, అమెజాన్, గ్లోబల్ ఇన్నోవా, ఏగిస్ కంపెనీలు వంద చొప్పున ఉద్యోగాలకు మేళా నిర్వహించగా, సాగర్స్ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్(20), బిగ్-సి(10), ఎం మోడల్స్(50) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఉద్యోగ ప్రకటనలేవీ ఇవ్వకుండా టీడీపీ కార్యాలయంలోనే జాబ్‌మేళాలు నిర్వహించడం వల్ల పార్టీకి సంబంధించిన వారికే తప్ప సాధారణ నిరుద్యోగులకు ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
10, 11, 12 తేదీల్లో టీటీడీపీ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఇ.పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, చాడ సురేష్‌రెడ్డి, బిల్యానాయక్ తెలిపారు. మంగళవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో చలనం లేదని ధ్వజమెత్తారు. రైతులకు అండగా నిలిచేందుకు 10న నల్లగొండ జిల్లా, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్లో చేర్చుకోవడమే పాలన అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్లనే రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా పాలకుర్తిలో విమర్శించారు. ప్రతిపక్షాలపై అనవసర విమ ర్శలు మానుకోవాలన్నారు. మార్క్‌ఫెడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను మాయమాటలతో గారడీ చేస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది. 19న ఒక్కరోజే సర్వే చేసి ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తానని చెప్పడమే దీని కి నిదర్శనమని ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఆయన టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక సర్వేను వారం రోజులు నిర్వహిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులకు విద్యుత్ ఇవ్వకుండా లాఠీచార్జ్‌లు చేయిస్తూ, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించకుండా రోడ్డు మీద పడేస్తూ సాగిస్తున్న పాలనపై ప్రజలతో కలిసి తిరగబడతామన్నారు. రమణ మాట్లాడుతూ కేసీఆర్ రెండు నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. -
బాబు వచ్చాడు... జాబు పోయింది!
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ఉద్యోగుల గెంటివేత హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా మూడు నెలల క్రితం ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రతినిధి చొప్పున ఎన్నికల సర్వే, పార్టీ కార్యకలాపాల కోసం 294 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ నాయకులను ఎన్నుకునేందుకు కొందరు నిరుద్యోగ యువతిలను కూడా రిక్రూట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచాయి... ఎన్నికలు ముగిశాయి... ఫలితాలు వచ్చాయి... బాబు గెలిచాడు... అయితే పర్మినెంట్ అనుకున్న ఉద్యోగాలు ఉన్న పళంగా పోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఈ ఉద్యోగులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాబుతో ములాఖత్ కోసం పడిగాపులు కాసారు. ట్రస్ట్ భవన్‌లోకి అనుమతించకపోవడంతో కేబీఆర్ పార్కు వద్ద ఆకలిడప్పులతో అలమటిస్తూ ఉండిపోయారు. మీకు హామీలు ఎవరు ఇచ్చారో వారిని తీసుకొని రండంటూ ట్రస్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశాడని బాధితులు వాపోయారు. సాక్షాత్తు ట్రస్ట్ భవన్‌లోనే మాకు శిక్షణా తరగతులు ఇచ్చారని, చంద్రబాబు కూడా కొన్నిసార్లు తమతో ముఖాముఖి అయి మాట్లాడిన సందర్భాలున్నాయని ఇలా మోసపోతామని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకునేటప్పుడే అందరు ఉన్నత చదువులు చదివి ఉండాలని మంచి భవిష్యత్ ఉంటుందని, రూ. 18 వేల జీతం అని చెప్పారని వారు బాధపడుతున్నారు. ధర్నా చేయడానికి వచ్చిన వీరందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెల కొంది. లోకేష్ వచ్చాక నిర్ణయం చెబుతామని ట్రస్ట్భవన్ వర్గాలు చెప్పడంతో వారు ఎటు పాలుపోని స్థితిలో ఉన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులు
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులు
హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్ సవరణను కేంద్రం ఆమోదించడంపై తెలంగాణ వాదుల నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మొన్న బీజేపీ కార్యాలయంపై దాడికి దిగిన తెలంగాణ ఆందోళన కారులు.. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. సోమవారం తెలంగాణ విద్యార్థి సంఘాలు టీడీపీ ట్రస్ట్ భవన్ ఎదుట భారీ నిరసన చేపట్టాయి. ఓ దశలో ఎన్టీఆర్ భవన్ లో కి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. -
బాబూ.. దయ చూపవా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కరుణ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం సోమన్నపాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు గంధవరపు ఇర్నయ్య అయిదు రోజులుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడు మాత్రం కనిపించటం లేదు. ఇర్నయ్యకు సోమన్నపాలెంలోని సర్వే నంబరు 237.72లో ఉన్న 20 సెంట్ల భూమిలో 13 సెంట్ల భూమిని నారు యల్లాజీ, నరం బసవయ్య కొనుగోలు చేస్తామని చెప్పి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన ఏడు సెంట్ల భూమి తనది అని యల్లాజీ చెబుతున్నారు. తన భూమిని అన్యాయంగా లాక్కున్న వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని ఈ నెల 12న విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించినట్లు ఇర్నయ్య తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్య తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించినా స్పందన లేదని, దీంతో మరోసారి సీఎంను కలిసి విన్నవిద్దామనే ఉద్దేశంతో లేక్‌వ్యూ అతిథిగృహం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ తన కుమార్తె పెంటమ్మతో కలిసి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని, సీఎంను కలవనివ్వటం లేదని తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆయన కనిపించిన వారందరినీ దీనంగా వేడుకుంటున్నారు. -
ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
హైదరాబాద్: ఎన్నికలు, ఎన్నికల కష్టాలు అందరికీ తెలుసు. అదీ ఏ పార్టీతో సంబంధంలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు. అయినా ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు ఫలితం లేకుండా పోయింది. సాదారణంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యేని ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా పెద్దగా అభ్యంతరాలు ఉండవు. పాపం కృష్ణమోహన్ విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కృష్ణమోహన్ టిడిపిలో చేరడానికి తీవ్రప్రయత్నాలు చేయవలసి వస్తోంది. ఆయన పార్టీలో చేరడాన్ని టిడిపి నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణమోహన్ గెలిచిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు.ఆ తరువాత ఆమంచి టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగింది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియడంతో కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో ఈ విషయమై పెద్ద రభసే జరిగింది. ఆమంచికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని ఆందోళన చేశారు. దీంతో ఆమంచిని పార్టీలో చేర్చుకోలేదు. ఆమంచి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండటంతో కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ రోజు చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆమంచి టిడిపిలో చేరలేకపోతున్నారు.Follow @sakshinews -
దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర నిర్మాణంలో కీలకమైన దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బేతాళ శరత్‌బాబు పేర్కొన్నారు. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు బుధవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఎంతోకాలంగా అణగదొక్కబడుతున్న దళిత వర్గాలకు కొత్తరాష్ట్రంలోనైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నూతన రాష్ట్ర నిర్మాణంలో దళితులు సహాయ,సహాకారాలు అందజేస్తారని బాబుకు చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబును కలిసినవారిలో తనతో పాటు రామన్నగూడెం సర్పంచ్ ఢీకొల్లు రమేష్, మాల మహానాడు నాయకులు పండు నాగరాజు, బేతాళ నవీన్, కాట్రు బెనర్జీ తదితరులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పచ్చధనం పరవళ్లు
* కోట్లు కుమ్మరిస్తున్న టీడీపీ అభ్యర్థులు * ఓటుకు రూ.1000 చొప్పున పంపిణీ * మిక్సీలు, కుక్కర్లు, గోల్డ్ కాయిన్లూ ఎర * ఏరులై పారుతున్న సారా, మద్యం * ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బృందాల రాక! సాక్షి, కాకినాడ : ఎంతలా ప్రచారం చేసినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మడం లేదు. పొర్లుదండాలు పెట్టినా విశ్వసించడం లేదు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిని తప్పించుకోవడానికి చివరకు నోట్ల కట్టలను నమ్ముకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనేందుకు కోట్లు వెదజల్లుతున్నారు. ఓపక్క మద్యం, నాటుసారా ఏరులై పారిస్తూ, మరోపక్క వివిధ వర్గాలకు గృహోపకరణాలు పంపిణీ చేస్తున్నారు. వన్‌గ్రామ్ గోల్డ్ కాయిన్లు, వెండి ఆభరణాల పంపిణీ కూడా చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వారి ప్రలోభాల పర్వం కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రజాబలంతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అభ్యర్థులు పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు నుంచే ప్రలోభాలకు తెరతీశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. నోట్ల పంపిణీని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. శుక్రవారం ఈ బృందాలు మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నాయకులతో సమావేశమైనట్టు సమాచారం. కాగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలతో పాటు ఇంట్లో ఉండే సభ్యులను బట్టి సొమ్ము పంపిణీ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే విధిగా ఓట్లు వేస్తారన్న గురి ఉన్న వర్గాలకే పంపిణీ చేస్తున్నా.. నమ్మకం చాలక ‘మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే వేయించా’లంటూ హారతిపై వాగ్దానాలు చేయిస్తున్నారు. పూటకో క్వార్టర్.. ఇక రాత్రుళ్లయితే మద్యంతో పాటు నాటుసారాను విచ్చలవిడిగా పోయిస్తున్నారు. నాయకుల చుట్టూ తిరిగే కార్యకర్తలు, అనుచరులకు రోజూ ఉదయం ఒక క్వార్టర్, సాయంత్రం మరో క్వార్టర్ అందిస్తున్నారు. యువకులకైతే కొన్ని ఎంపిక చేసిన బంక్‌లలో ఎన్నికలయ్యే వరకు పెట్రోల్ ఉచితంగా పోయిస్తున్నారు. మండపేటలో ఇటీవలే పీఎంపీలు, ఆర్ఎంపీలతో సమావేశమైన టీడీపీ నేతలు వారితో తమ పార్టీకే ఓటు వేసేలా వాగ్దానం చేయించుకొని వన్‌గ్రామ్ గోల్డ్ కాయిన్లు పంచిపెట్టారు. ముమ్మిడివరంలో డ్వాక్రా సంఘాల యానిమేటర్లు, ఉపాధి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు హాట్‌బాక్సులు, మిక్సీలు పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ చంద్రబాబు, అభ్యర్థుల చిత్రాలు ముద్రించిన విసనకర్రలు పంపిణీ చేస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని బొట్టుబిళ్లలు, చీరలు పంపిణీ చేస్తున్నారు. రామచంద్రపురంలో ఆ పార్టీ అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తూ మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థి ఇంజనీరింగ్ విద్యార్థులను బలవంతంగా ప్రచారంలోకి దింపి, ఇంటింటికీ తిప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా వారితోనే డబ్బులు, మద్యం పంపిణీ చేయిస్తున్నారని తెలిసింది. పెద్దాపురంలోనూ ఆ పార్టీ అభ్యర్థి ఈ తరహా దిగజారుడు వ్యవహారాలనే నమ్ముకున్నారు. ఇక రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తూ ఓటర్లను గంపగుత్తగా కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500 చొప్పున, మరికొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 చొప్పున పంచుతున్నారు. టీడీపీ ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏదో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పాయకరావుపేట వద్ద అనుమతి లేకుండా ప్రచార సామగ్రిని తరలిస్తున్న టీడీపీ వాహనాన్ని, డమ్మీ ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కె..గంగవరం మండలం ఉండూరులో టీడపీ నాయకుల నుంచి 33 మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీవాడే స్కామ్ బాబు
* మోడీ.. స్కామాంధ్ర బాబు పాలన పుణ్యమే * మీ బీజేపీ అచ్చేసిన పుస్తకాలే చెప్పిన వాస్తవమిది మిస్టర్ మోడీ! తమరు నోరెత్తితే చాలు... స్కామాంధ్ర, కుంభకోణాలు అంటూ రామోజీ-చంద్రబాబు ద్వయం పలికించినట్టల్లా పలుకుతు న్నారు. వాళ్లందించిన పాచి స్క్రిప్టునే ప్రతి వేదికపైనా యథాతథంగా వల్లె వేస్తున్నారు. అచ్చం మాట్లాడే చిలుకను తలపిస్తున్నారు. ఇది చూసి బహుశా పచ్చ కూటమి చంకలు గుద్దుకుంటోందేమో గానీ... సాక్షాత్తూ స్కాముల చక్రవర్తిగా చెప్పదగ్గ చంద్రబాబునే పక్కన కూచోబెట్టుకుని మీరు విసురుతున్న ఈ కామెడీ డైలాగులు విని తెలుగు ప్రజానీకం మాత్రం మనసారా నవ్వుకుంటోంది. కనీసం దళితులని కూడా చూడకుండా స్త్రీలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించి, చివరికి అందరితోనూ ఛీకొట్టించుకున్న రామ్‌దేవ్ బాబా వంటి ఘనుడు ఒకవైపు. స్వయానా నయ వంచక అవినీతి సమ్రాట్టయిన నారా బాబు మరోవైపు. వీరిద్దరినీ చెరో చంకలో ఉంచుకుని ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ మధ్యలో మీరు! బాబూ మోడీ! మీ చంకనెక్కి ఎంచక్కా పళ్లికిలిస్తున్న చంద్రబాబు నిజానికి సకల స్కాములకూ సంగమ స్థానం వంటివాడని, సాక్షాత్తూ స్కామ్‌దేవ్ బాబాయేనని తెలుసుకోండి! ఒక ఏలేరు. ఒక ఎమ్మార్. ఒక జీఎమ్మార్. ఒక హెరిటేజ్. ఒక రహేజా... ఏమని చెప్పేది! ఎన్నని ఏకరువు పెట్టేది!! చెప్పుకుంటూ పోతే మీ చంకలోని చంద్రబాబు పాల్పడ్డ భూ అక్రమాలకు, కాసుల కక్కుర్తితో ఆయన తెరతీసిన కుంభకోణాలకూ అంతన్నదే ఉండదు. ఆ అవినీతి అనకొండ తాలూకు అక్రమాల చరిత్రకు అద్దం పట్టే చిరు ప్రయత్నమిది. మోడీ! చిత్తగించండి. ఆనక మీ మతి పూర్తిగా పోకపోతే మమ్మల్ని అడగండి... ఇదీ చంద్రబాబు చరితం ఎన్టీఆర్ ట్రస్టు భవన్... మహా మాయ ఐఎంజీ... బినామీల బాగోతం: తన బినామీలైన బిల్లీ బ్రదర్స్‌తో ఐఎంజీ భారత పేరుతో ఓ కంపెనీ పెట్టించి, రాజధానిలో అత్యంత విలువైన 850 ఎకరాలను కారుచౌకగా ఆగమేఘాల మీద కేటాయించడమే గాక, భవిష్యత్ హక్కులను కూడా దానికే రాసిచ్చిన పచ్చి అవినీతిపరుడు బాబు. కనీసం కార్యాలయం కూడా లేని, కేవలం రూ.5 లక్షల మూలధనం మాత్రమే ఉన్న ఆ కంపెనీ ఏకంగా రూ.750 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును చేపడుతుందని, రాష్ట్ర క్రీడా రంగ చరిత్రనే మార్చేస్తుందని నమ్మబలికారు. ఎకరా కోట్లు పలుకుతుంటే, కేవలం రూ.50 వేల చొప్పున కట్టబెట్టారు. అది కూడా ఆపద్ధర్మ సీఎం హోదాలో! భూమితో ఆగకుండా ప్రభుత్వ ఖర్చుతో రాజధానిలో అప్పటికే నిర్మించిన 8 స్టేడియాలను కూడా 45 ఏళ్ల పాటు ఐఎంజీకి ఉదారంగా లీజుకిచ్చారు! లీజు గడువు ముగిశాక ఐఎంజీ తనకు నచ్చిన రేటు చెల్లించి ఆ స్టేడియాలన్నింటినీ సొంతం చేసుకోవచ్చంటూ ఎక్కడ లేని దాతృత్వమూ ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా అందుబాటులో ఉన్న అన్ని రాయితీలనూ దానికి అనుగ్రహించారు. అం తేనా... పాపం ఐఎంజీకి కార్యాలయం కూడా లేదేంటా అని తెగ బాధపడిపోయారు. బంజారాహిల్స్‌లో, ఎకరా రూ.25 కోట్లు పలుకుతున్న చోట ఐదెకరాలను ఎకరాకు రూ.50 వేల చొప్పున ‘కార్యాలయం కట్టుకోండి’ అంటూ కట్టబెట్టారు. ఎమ్మార్... ఎంత ఘోరం! శ్రీమంతులకు విలాసవంతమైన విల్లాలు, వారు ఆటాడుకుని సేదదీరేందుకు గోల్ఫ్ కోర్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు తదితరాల నిర్మాణానికంటూ అతి విలువైన 535 ఎకరాలను షరా మామూలుగా కారుచౌకగా ఎమ్మార్ కంపెనీకి కట్టబెట్టారు నారా బాబు. ఇందుకోసం ఎల్ అండ్ టీ, ఐఓఐ వంటి అస్మదీయ సంస్థలను రంగం నుంచి తప్పించి మరీ ఎమ్మార్ బిడ్‌కు ఆమోదముద్ర వేశారు. తన మాట విని తప్పుకున్నందుకు ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ నిర్మాణ ప్రాజెక్టును, ఐఓఐకి హైటెక్ సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ పేరుతో బంజారాహిల్స్‌లో అతి విలువైన రెండున్నర ఎకరాలను కట్టబెట్టారు బాబు. ముఖ్యమంత్రిగా తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డంగా దుర్వినియోగపరుస్తూ ఎమ్మార్‌కు బాబు సర్వం దోచిపెట్టిన తీరు ఇంత స్పష్టంగా కన్పిస్తున్నా సరే, రామోజీకి మాత్రం ఆయనను పల్లె త్తు మాట అనాలని కూడా అన్పించదు. పైగా, తన తాబేదారు బాబు పాపాన్ని వైఎస్‌కు, ఆయన వారసునికి రుద్దేందుకు పిచ్చి ప్రయత్నం చేసి పరవశించిపోయే పైశాచికత్వం రాజగురువుది! గ్యాసుకు క్యాషు! కేజీ బేసిన్ గ్యాస్. ఈ మాట వినగానే టక్కున గుర్తొచ్చేది రిలయన్స్-రామోజీ-చంద్రబాబోజీ! కేజీ బేసిన్‌లోని ఒక్క డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ ద్వారానే వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో రిలయన్స్‌కు హీనపక్షం రూ.1.5 లక్షల కోట్లు దఖలు పడబోతున్నట్టు అంచనా. అంతటి లాభదాయకమైన ఆ గ్యాస్ వెలికితీత ప్రక్రియలో ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయాలని ఉన్నతాధికారులు మొదలు విపక్షాల దాకా ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా రిలయన్స్ ముందు మోకరిల్లారు బాబు. ఆ ప్రాజెక్టు దానికే దక్కేలా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను నడి సముద్రం లో ముంచేశారు. అనంతర కాలంలో పుట్టెడు కష్టాల్లో మునిగిపోయిన చంద్రబాబు రాజగురువు రామోజీని గట్టెక్కించేందుకు ఆయన సంస్థల్లోకి ఏకంగా రూ.2,600 కోట్లను రిలయన్స్ దొడ్డిదారి పెట్టుబడుల రూపంలో మళ్లింపజేసింది. అంటే గ్యాసుకు క్యాషు క్విడ్ ప్రొ కొ అన్నమాట! ఎల్ అండ్ టీకి ఎంత లబ్ధో! బాబు పాలనలో గరిష్టంగా లబ్ధి పొందిన సంస్థ ఏదైనా ఉందంటే... అది ఎల్ అండ్ టీ. సీఎం అయిన నాలుగు రోజులకే హైదరాబాద్‌లో దానికి ఏకంగా 148 ఎకరాలు కట్టబెట్టారు బాబు. ఏడాదిలోపే మరో 17 ఎకరాలు రాసిచ్చారు. అంతటితో ఆగలేదు. హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టును చదరపు అడుగుకు ఏకంగా రూ.2,700 చొప్పున చెల్లించారు. మాదాపూర్‌లో మరో 78 ఎకరాలను నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. సచివాలయంలో డి-బ్లాకు నిర్మాణం, విశాఖ హైటెక్ సిటీ... ఇలా ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టిన ప్రాజెక్టులెన్నో! చంద్రబాబు మార్కు మాయాజాలానికి పరాకాష్టగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. తాను, తన భార్య మాత్రమే జీవితకాలపు ట్రస్టీలైన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేరుతో బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన 3,981 గజాల స్థలాన్ని దిగమింగారు. ఆ స్థలం కోసం ట్రస్టీగా తానే దరఖాస్తు పెట్టుకుని, సీఎంగా దాన్ని తానే పరిశీలించి, తానే అనుమతి జారీ చేసుకున్న అసాధ్యుడు బాబు. అలా దఖలుపడ్డ స్థలంలో బాబు తాబేదారు సంస్థ ఎల్ అండ్ టీ ఓ చక్కటి భవనాన్ని నిర్మించి ఇచ్చింది. దానికి హైటెక్ సిటీ నిర్మాణ ప్రాజెక్టును కట్టబెట్టినందుకు ప్రతిఫలంగానే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను ఉచితంగా కట్టిచ్చిందని చెబుతుంటారు. ఆనక ఆ భవనాన్ని తానే అధ్యక్షునిగా ఉన్న టీడీపీకి అద్దెకిచ్చిన ఘనుడు చంద్రబాబు. అంటే పార్టీ అధ్యక్షుని హోదాలో ఆ భవనాన్ని నిత్యం అనుభవిస్తున్నదీ బాబే. మరోవైపు ట్రస్టీ హోదాలో పార్టీ నుంచి అద్దెను దిగమింగుతున్నదీ ఆయనే. దటీజ్ చంద్రబాబు! ఇక్కడితో అయిపోలేదు. టీడీపీ నేతలు తదితరులు బాబుకు ముడుపులను కూడా ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళాల రూపంలోనే సమర్పించుకుంటుంటారు. ఈ ట్రస్టు బాబుకు మల్టీ పర్పస్ వెహికిల్ అన్నమాట! ‘సత్యం’తో క్విడ్ ప్రొ కొ సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజుతో చంద్రబాబు సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్‌కు వస్తే రతన్ టాటా వంటి దిగ్గజాలను కూడా కాదని రాజుకు ఆయన పక్కన కుర్చీ వేశారు బాబు! హైదరాబాద్ మాదాపూర్‌లో 19.2 ఎకరాలు, విశాఖలో 6.5 ఎకరాలను సత్యంకు ధారాదత్తం చేశారు. వీటికి ప్రతిగానే, చదువులో అంతంతమాత్రమైన బాబు కుమారుడు లోకేశ్‌కు స్టాన్‌ఫర్డ్, కార్నెగీ మెలన్ వంటి అమెరికా వర్సిటీల్లో భారీ డొనేషన్లు కట్టి మరీ రామలింగరాజు సీట్లు సాధించి పెట్టారని చెబుతారు. కంపెనీల బినామీకరణ నిజాం షుగర్స్ మొదలుకుని రిపబ్లిక్ ఫోర్జ్ దాకా లెక్కలేనన్ని ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల సాకుతో అత్యంత చవకగా అస్మదీయులకు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర బాబుది. అసలు బాబు దృష్టిలో ప్రైవేటీకరణ అంటే... బినామీకరణే! తన బినామీలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టడమే. ఆ విధంగా రిపబ్లిక్ ఫోర్జ్‌ను టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ సోదరునికి; నెల్లూరు నూనె మిల్లును తన బినామీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి; పాలేరు షుగర్స్‌ను నామా నాగేశ్వరరావుకు; గురజాల, ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లులను తన సన్నిహితునికి చెందిన నూజివీడు సీడ్స్‌కు... ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో, ఎన్నెన్నో! ఏలేరు... రైతుల పరిహారం దిగమింగారు విశాఖ జిల్లాలో ఏలేరు కాల్వ కోసం సేకరించిన సాగు భూమికి రైతుల ముసుగులో కోట్ల రూపాయల్లో పరిహారాన్ని తన బినామీల ద్వారా దిగమింగారు బాబు. తన బండారం బయటపడ్డా, దీనిపై న్యాయ విచారణను నానా సాకులతో అడ్డుకుంటూ వస్తున్న ఘనుడాయన. ఈ కుంభకోణానికి సూత్రధారి, ప్రధాన పాత్రధారి చంద్రబాబేనని పేర్కొంటూ బీజేపీ పుస్తకమే ప్రచురించింది. పిచ్చి పీపీఏలు ‘అసలు కరెంటు ఉత్పత్తే చేయకపోయినా సరే, మీకు చార్జీలన్నీ చెల్లించేస్తాం’ అంటూ పలు ప్రైవేట్ కంపెనీలతో బాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫలితం. .? గౌతమి, వేమగిరి, కోనసీమ, జీవీకే ప్లాంట్లకు కోట్లలో చెల్లింపులు, ఖజానాపై వేలాది కోట్ల భారం. భువనేశ్వరి... భలే ‘సెటిల్మెంటు’ భువనేశ్వరి కార్బైడ్స్ పేరుతో 1984లో బాబు రెండు కంపెనీలు పెట్టారు. రేణిగుంటలోని వాటి తాలూకు ఐదెకరాలను తనఖా పెట్టి రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. తర్వాత వాయిదాలు ఎగ్గొట్టారు. తర్వాత ఆ భూముల విలువ అమాంతం పెరగడంతో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.11 లక్షలు కట్టి రుణమంతటినీ మాఫీ చేసుకుని తన భూముల్ని వెనక్కు తీసుకున్నారు. అది కూడా తీరిగ్గా 17 ఏళ్లకు, అంటే 2001లో. తాను సీఎంగిరీ వెలగబెడుతున్న రోజుల్లో! 40 లక్షల రుణానికి 17 ఏళ్ల తర్వాత నాలుగో వంతు మొత్తం చెల్లించి సరిపెట్టారన్నమాట! ఒకవైపు వేలాది కోట్లు కొల్లగొడుతూ కూడా... ఇలాంటి చిలక్కొట్టుడు యవ్వారాలనూ వదల్లేదన్నమాట. మద్యంలోనూ ముడుపులు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మద్య నిషేధం పేరుతో పన్నుల్ని పెంచి ప్రజలపై భారం మోపిన బాబు, ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తేశారు. మద్యం కొనుగోళ్లలో నానా అక్రమాలకు పాల్పడి కనీసం రూ.600 కోట్లు అస్మదీయులకు దోచిపెట్టారు. ఆ అక్రమాలేవీ వెలుగులోకి రాకూడదనే ఉద్దేశంతో, 2004లో సంబంధిత ఫైలును అధికారికంగానే తగలబెట్టించిన గుండెలు తీసిన బంటు ఆయన! పా‘పాల’ భైరవుడు తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు ముఖ్యమంత్రి హోదాలో అడ్డగోలుగా రాయితీలివ్వడం ద్వారా కోట్లలో బొక్కేశారు బాబు. 1992లో ప్రారంభమైన ఈ కంపెనీ దశ, 1995లో ఆయన సీఎంగా ప్రమాణం చేసిన కొద్ది రోజులకే తిరిగిపోయింది. అమ్మకపు పన్ను వాయిదా రూపంలో రూ.15 కోట్లను జేబులో వేసుకున్నారు బాబు. దానిపై వడ్డీ రూపంలో గత 15 ఏళ్లుగా హీనపక్షం రూ.100 కోట్లకు పైగా దిగమింగారు. ఆ రూ.15 కోట్ల అసలును తీరిగ్గా ఇప్పటి నుంచి కొన్నేళ్ల పాటు వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తారన్నమాట. ఆలోపు బాబు జేబులోకి వడ్డీ రూపంలో చేరే మొత్తాన్ని మాత్రమే లెక్కించినా ఎంతలేదన్నా రూ.200 కోట్లు అప్పనంగా లాభం! ఇంతేనా...? తన హెరిటేజ్ కోసం... బ్రహ్మాండంగా నడుస్తున్న చిత్తూరు డెయిరీ గొంతు నులిమిన కసాయి చంద్రబాబు! అవినీతి జయ‘భేరి’ జయభేరితో చంద్రబాబుది అవినాభావ బంధం. హైటెక్ సిటీ రాకముందే, ఆ విషయం బయటికి పొక్కక ముందే అస్మదీయుడు మురళీమోహన్‌తో ఆ చుట్టుపక్కల భారీగా భూములు కొనిపించారు బాబు. తర్వాత తీరిగ్గా హైటెక్ సిటీని ప్రకటించారు. ఆ భూములకు అమాంతంగా రెక్కలొచ్చాయి. హవాలా బాబు ...అని యూరో లాటరీ కేసు నిందితుడైన కోలా కృష్ణమోహన్ స్వయంగా మీడియాకే వెల్లడించారు. టికెటిస్తానని మభ్యపెట్టి తననుంచి చంద్రబాబు రూ.5.1 కోట్లు దండుకున్నారని, ఆయన కోరిక మేరకు తానే స్వయంగా సింగపూర్‌లోని ఆయన ఖాతాకు బదిలీ చేశానని బ్యాకు పేరు, ఖాతా సంఖ్య తదితర వివరాలతో పాటుగా బయట పెట్టారు. ఇవి మాత్రమే కాదు... కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు... ఇలా ఎన్నో, ఎన్నెన్నో! రెండెకరాలతో మొదలయ్యానని చెప్పుకునే బాబు నేడు ఎన్ని వేల (లక్షల) కోట్లకు పడగలెత్తారో చెప్పడం కష్టం. తొమ్మిదేళ్ల పాలనా కాలం మొత్తంమీద ఏకంగా 26 వేల ఎకరాల పైచిలుకు భూమిని అస్మదీయులకు, బినామీలకు అడ్డంగా దోచిపెట్టారు బాబు. వీటి విలువ ఎలా చూసి నా కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. అంటే ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. జీఎమ్మార్‌కు జీ హుజూర్ శంషాబాద్‌లో కనీసం రూ.79,860 కోట్ల విలువ చేసే 5,500 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణం సాకుతో జీఎమ్మార్ సంస్థకు ధారాదత్తం చేసేశారు బాబు. దేశంలో ఏ విమానాశ్రయానికీ 3,000 ఎకరాలకు మించి భూముల్లేవు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 2,600 ఎకరాలు చాలని ప్రభుత్వ కమిటీలే చెప్పినా బాబు బేఖాతరు చేశారు. అనుమతులతో పాటు జీఎమ్మార్‌కు వీలైనన్ని రాయితీలు ఇప్పించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు వద్ద తనకున్న పలుకుబడినంతా ఉపయోగించారు. ఈ ఉదంతంలో భారీగా దండుకున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రకటన కూడా వెలువడకముందే ఆ పరిసరాల్లో రాజగురువు రామోజీతో, అస్మదీయులతో, బినామీలతో భూములను కారుచౌకగా కొనిపించారు. లోకేశ్‌కు నాయనమ్మ ‘చదివింపులు’ పసుపు కుంకుమల కింద వచ్చిన రెండెకరాలు తప్ప తనకు మరే ఆస్తిపాస్తులూ లేవని చెప్పిన చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ, 2000లో ఏకంగా రూ.40 లక్షలు పెట్టి హైదరాబాద్‌లోని మదీనగూడలో ఐదెకరాలు కొనుగోలు చేశారు. ఏడాది తిరక్కుండానే వాటిని మనవడు లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చేశారు. దేశంలోనే సంపన్న నేత రాజకీయాల్లోకి వచ్చేనాటికి తన ఆస్తి కేవలం రెండెకరాలేనని చంద్రబాబు పదేపదే గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి సంపద ఇప్పుడు ఎన్ని వేల కోట్లో తేల్చిచెప్పడం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే బాబు ఆస్తిని హీనపక్షం రూ.2,000 కోట్లుగా తెహల్కా అంచనా వేసింది. అప్పట్లో దేశంలోని నేతలందరిలోనూ ఆయనే అత్యంత ధనికుడని కూడా తెలిపింది. -
బాబు ఆటలో.. ఓడింది ‘తమ్ముళ్లే’
* నిజం తెలుసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు * కష్టకాలంలో అండగా ఉన్నవాళ్లకు మొండిచెయ్యే! * పార్టీ మారి ఎమ్మెల్యేలైన వారెందరో! * దశాబ్దాలుగా సేవలకే పరిమిత మైన నేతలు * అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... బాబు అంతే * పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే వారికి గుర్తింపు కరువు.. అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి నమ్ముకుంటే మట్టే : ‘తమ్ముళ్లూ... మీరే నాకు ప్రాణం. ఇప్పటికీ నేను ఇలా నిలబడ్డానంటే అదంతా మీ రెక్కల కష్టమే. దెబ్బలు తిన్నారు.. ప్రాణాలిచ్చారు. 30ఏళ్లుగా నా కోసం అన్నీ త్యాగం చేశారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఇన్నేళ్లూ నా వెంట ఉన్నారు. ఈ ఒక్కసారి అన్నీ వదులుకొని పని చేయండి. ఆ తర్వాత మీ సంగతి చూస్తా’ అని ఊదరగొట్టడం చంద్రబాబు నైజం. కానీ, ఇవన్నీ బూటకపు మాటలే! పోలంపల్లి ఆంజనేయులు: రాజకీయాల్లో విశ్వసనీయత తప్పనిసరి. ప్రజలు, పార్టీ కార్యకర్తలు నాయకుడిని నమ్మాలి. అలా నమ్ముకున్న వారికి నేనున్నాననే ధైర్యం చెబుతూ అండగా నిలిచిన వాడే నిజమైన ప్రజా నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ఆ విశ్వసనీయతే కొరవడింది. పార్టీ అధినేత చంద్రబాబు మీద ప్రజలకే కాదు... పార్టీ నాయకులకు సైతం నమ్మకం పోయింది. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని, మంచి కాలం రాకపోతుందా..? అన్న ఆశతో సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటూ సేవ చేస్తున్న నాయకులకు ఈసారి టికెట్ల కేటాయింపు తర్వాత పూర్తిగా విశ్వాసం పోయింది. అందుకే ఇంతకాలం భుజాన మోస్తున్న పార్టీ జెండాను, కండువాలను పారేసి బాధతో పక్కకు తప్పుకుంటున్నారు. వీరిలో నూనూగు మీసాల యువకులుగా పార్టీలో చేరి వృద్ధులుగా మారిన వారు కొందరైతే... ఇతర పార్టీల్లో చేరే ఓపిక కూడా లేక ట్రస్ట్భవన్కే అంకితమైన వారు కొందరు. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులను పంపిణీ చేయని చంద్రబాబు... అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిసీ.. టిక్కెట్లు రాని వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని చెపుతుంటే నవ్వుకుంటున్నారు. వీరంతా సేవలకే పరిమితమా..? ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెళ్లగానే... రిసెప్షన్ పక్కనున్న కార్యాలయంలో వికలాంగుడైన సీని యర్ నాయకుడు పి. సాయిబాబా కనిపిస్తారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడిగా తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన నాయకుడాయన. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వికలాంగుల కార్పొరేషన్, హస్తకళల అభివద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. కానీ చంద్రబాబు ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. మరో వికలాంగుడైన నాయకుడు జి. కోటేశ్వరరావు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎక్కడికివెళ్లినా వారి వాహనాల ముందు కోటేశ్వర్రావు మూడు చక్రాల స్కూటర్ పచ్చజెండాతో సాగాల్సిందే. ఆయనకు పార్టీ పరంగా చంద్రబాబు చేసిందేమీ లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన ముమ్మనేని అమర్నాథ్ బాబు ఎన్టీఆర్‌తో, చంద్రబాబుతో సన్నిహితుడిగా వ్యవహరించేవారు. ఈసారైనా బోధన్ నుంచి టిక్కెట్టు ఇస్తారని ఆశించిన ఆయనకు చంద్రబాబు చెయ్యిచ్చారు. మరోనేత మోహన్‌రెడ్డిది ఇదే దుస్థితి. కాంగ్రెస్ నేతగా చిరపరిచితుడైన పీఎల్ శ్రీనివాస్ దశాబ్దం క్రితం టీడీపీలో చేరి సనత్‌నగర్ టికెట్ ఆశిస్తున్నా అవకాశం రాలేదు. చంద్రబాబు సమకాలీకుడూ, సన్నిహితుడూ అయిన కొమ్మినేని వికాస్ సనత్‌నగర్, కూకట్పల్లి టిక్కెట్టు కోసం ప్రయత్నించినా ఫలితం లేక మిన్నకుండి పోయారు. నల్గొండ జిల్లా నాయకుడు భూపాల్‌రెడ్డిని పార్టీ వదిలేసింది. మునుగోడు ఇన్చార్జి కర్నాటి వెంకటేశం, హుజూర్‌నగర్‌లో చావా కిరణ్మయి, మిర్యాలగూడ నిరంజన్‌రెడ్డి, నల్గొండ బోయిపల్లి కృష్ణారెడ్డి ఈ కోవలోకే వస్తారు. పార్టీ మారితేనే రాజకీయ ఎదుగుదలా..? పదేళ్ల క్రితమే కళ్లు తెరిచిన టీఆర్ఎస్ వంటి పార్టీల్లోకి వెళ్లిన కొప్పుల ఈశ్వర్ లాంటి వారు ఎమ్మెల్యేలయ్యారు. దీంతో కొందరు నేతలు ఆలస్యంగా కళ్లు తెరుస్తున్నారు. పచ్చజెండా పక్కన పడేసి గులాబీ కండువాను కప్పుకుంటున్నారు. ముషీరాబాద్ నేత ముఠా గోపాల్, గోషామహల్ నాయకుడు ప్రేంకుమార్ ధూత్ గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ తరం నేతలకు సైతం ఇదే అనుభవం! రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సి. కృష్ణాయాదవ్పై నకిలీ స్టాంపుల కుంభకోణం కేసు కొట్టేసిన అనంతరం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. అంబర్‌పేట నుంచి టిక్కెట్ ఆశించినా చంద్రబాబు ఇవ్వలేదు. - పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్న కాగజ్‌నగర్‌కు చెందిన గుల్లపల్లి బుచ్చిలింగంను చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో రెబెల్‌గా బరిలో దిగారు. - కరీంనగర్ జిల్లాలో రామగుండం ఇంచార్జీగా సేవలందించిన గోపు అయిలయ్య యాదవ్‌ను ఎన్నికల ముందు మార్చి పెద్దిరెడ్డిని నియమించారు. దీంతో అయిలయ్య పార్టీకి రాజీనామా చేశారు. హుస్నాబాద్ ఇంచార్జీగా ఉన్న విద్యాసంస్థల అధిపతి పి. రవీందర్రావు పదేళ్లుగా పార్టీ బరువును మోశారు. తీరా ఈ స్థానాలను బిజేపికి కేటాయించారు. - చాలా కాలంగా మహబూబ్‌నగర్ శాసనసభ టికెట్‌ను ఆశిస్తున్న ఎం.పి.వెంకటేష్‌కు ఈ సారీ మొండిచేయే చూపారు. ఈ స్థానాన్ని బిజేపికి వదిలేశారు. - ఎన్టీఆర్ హయాంలో శాప్ చైర్మన్‌గా పనిచేసిన పి.ఆర్. మోహన్ పార్టీ సేవకే పరిమితమయ్యారు. - మీకోసం యాత్రను ముందుండి నడిపించిన ఎల్.దీపక్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వంటి యువ నాయకులను చంద్రబాబు పట్టించుకోలేదు. - బోసా వేణుగోపాల్ యాదవ్, నన్నూరి నర్సిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ వంటి వారు తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్నప్పుడు టీడీపీ జెండా పట్టుకొని గట్టిగా పనిచేశారు. వీరు ఆశించిన స్థానాలను బీజేపీకి అప్పగించారు. - ఎల్బీనగర్ నుంచి కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి ఎప్పటినుంచో టికెట్‌ను ఆశించి పని చేయగా, వారిని కాదని కృష్ణయ్యను తెర పైకి తేవడంతో రెబెల్స్‌గా పోటీకి సిద్ధమయ్యారు. - ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడు మదార్ సాహెబ్ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా టిక్కెట్టు ఇవ్వలేదు. - 1985లోనే అప్పటి యువ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్ధన్ రెడ్డిపై టీడీపీ తరుపున పోటీ చేసి 60 వేల ఓట్లు సంపాదించిన ఎం. నారాయణస్వామి, సుధాకర్ గౌడ్, చార్మినార్కి చెందిన వెంకట్రాములు గౌడ్ కనుమరుగయ్యారు. - 1994లో ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే మధుసూధనరావును అ తర్వాత బాబు పట్టించుకోలేదు. ఈసారి ఆ స్థానాన్ని బిజేపికి ఇచ్చారు. దీంతో మధుసూదనరావు కమలం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. - వరంగల్ జిల్లా భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు చివరి నిమిషంలో బిజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. ఇల్లెందులో వూకె అబ్బయ్యకు అవకాశం రాక ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు కూడా చివరి క్షణం వరకు టీడీపీ టికెట్‌ను ఆశించారు. -
నామా వైపే బాబు మొగ్గు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ముందుంది మొసళ్ల పండుగ’.... జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ సామెతను తలపింపచేస్తోంది. సాధారణ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు ఖరారు దశకు వచ్చే కొద్దీ తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా రెండు గ్రూపులుగా విడిపోయి టికెట్ తమకు కావాలంటే తమకు కావాలని పట్టుపడుతూ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఏదో ఒక వర్గానికి చెందిన అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయంలో మరో వర్గం నేతలు మెలికలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దంటూ పట్టుపడుతున్నారు. ఏపట్టు ఎలా ఉన్నా.... మొత్తంగా జిల్లా పార్టీలో ఎంపీ నామా నాగేశ్వరరావు హవానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. తుమ్మలను ఖమ్మం అసెంబ్లీ నుంచి పాలేరుకు మార్పించి, ఆ స్థానంలో తన వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి నాగప్రసాద్‌కు టికెట్ ఇప్పిం చేలా నామా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని, ఈ మేరకు పార్టీ అధినాయకుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి నాగప్రసాద్ల పేర్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే వార్తలు కొందరు తమ్ముళ్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు త్వరలో నే పార్టీని వదిలిపెట్టబోతున్నారని సమాచారం. ఇద్దరికే అవకాశం ఈసారి సాధారణ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి ఆయనతో పాటు ఆయన అనుచరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు మాత్రమే టికెట్ ద క్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు జనరల్ స్థానాలతో పాటు పార్లమెంటు టికెట్, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలో నామా వర్గానికే టికెట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తుమ్మల వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని వారంటున్నారు. పార్టీని మొదటి నుంచీ కాపాడుతున్న తుమ్మల వర్గానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని పట్టుకుని వేలాడుతున్నా తమకు ఒనగూరినదేమీ లేదని అంటున్న ఓ మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు అధికారికంగా టికెట్లు ప్రకటించిన మరుసటిరోజునే పార్టీని వీడివెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీసీ పేరుతోనూ వ్యూహం జిల్లాలో ఏదో ఒక జనరల్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనే డిమాండ్ జిల్లా టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం లేదా పాలేరు స్థానాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు అవకాశం రావచ్చని భావించారు. అయితే, ఈయన విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బీసీ కోటాలోనే మరికొందరు నాయకులు టికెట్ ఆశించారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇవ్వడంతో పాటు డీసీసీబీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించారని, మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, వర్గపోరు దృష్ట్యా బాలసానికి టికెట్ ఇప్పించడం తుమ్మల వర్గానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో నామా వ్యూహం ఫలించింది. బీసీకి టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బాలసానికి టికెట్ వస్తుందనే ఆలోచనతో ఆయన ముందు జాగ్రత్తగా ల్యాంకో ఉన్నతోద్యోగి నాగప్రసాద్‌ను తెరపైకి తెచ్చి తుమ్మల గ్రూప్‌నకు చెక్ పెట్టారు. పార్టీలోనికి వచ్చిన వెంటనే పెద్ద పదవి ఇప్పించడంతో పాటు ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రజాగర్జన సభలోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా నాగప్రసాద్‌కు తానున్నానని చెప్పారు. చంద్రబాబు వద్ద తనకున్న లాబీయింగ్‌తో బాలసానికి కాకుండా టికెట్ నాగప్రసాద్కే ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది. -
అందోల్‌లో ఏం జరుగుతోంది?
జోగిపేట, న్యూస్‌లైన్: ‘‘అసలు అందోల్ ఏం జరుగుతోంది...ఎందుకని పార్టీ తరఫున స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు ఎవరూ రావడం లేదు..ఇంతకీ అందోల్‌లో మనం ఉన్నామా...ఉన్నామని భ్రమపడుతున్నామా’’ టీడీపీ నేతలకు వచ్చిన అనుమానమిది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే తముళ్లు మాత్రం ‘‘మా తప్పేమీ లేదు..అంతా మీరే చేశారు’’ అంటూ నేతల మొహంమీదే చెప్పేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పి.బాబూమోహన్ వల్లే పార్టీ పరిస్థితి ఇలా తయారైందని విన్నవిస్తున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు తెలపగా, ఆయన బాబూమోహన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సపాన్‌దేవ్ సమీక్ష అందోల్ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసేందుకు పార్టీ అధిష్టానం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సపాన్దేవ్ను ఆదేశించింది. దీంతో శనివారం ఆయన నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు ముఖ్యులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. అందోల్, పుల్కల్ మండలాల అధ్యక్షులు మినహా అన్ని మండలాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని బాబూమోహన్‌పై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీడీపీ జిల్లా ఇన్చార్జిగా ఉన్న మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావుసైతం పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులకు ఫోన్‌చేసి మరీ ఆదివారం పార్టీ మీకే ‘బీ’ ఫారం ఇస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే అందోలు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలపై ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందోల్ ముఖ్యనేతలతోపాటు జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి మదన్మోహన్కు సైతం పార్టీ అగ్రనేతలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..బాబూమోహన్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్నది తేలనుంది. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద సిల్లీబ్రాండ్