కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..
హైదరాబాద్: మరోసారి టీఆర్ఎస్ టీడీపీ మధ్య ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుచిత వ్యాఖ్యలు అన్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు.
వారిని టీడీపీ వాళ్లు అడ్డుకోవడంతో భవన్ ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.