
'టీడీపీ ఆవిర్భావం ఓ చరిత్ర'
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓ చరిత్ర అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.35 years of Telugu Desam Party
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓ చరిత్ర అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మంగళవారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ 35వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు ఎగురవేసి... కేక్ కట్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులు... కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామన్నారు. అన్ని సమస్యలను తట్టుకుని పార్టీ నిలబడిందంటే అందుకు కార్యకర్తలే కారణమన్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు చేరుకుని.... ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆవిర్భావ వేడుకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేటి సాయంత్రం 5.00 గంటలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.