
వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో
పోస్ట్ చేసిన నంద్యాల టీడీపీ నేత.. మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం
నంద్యాల: గౌరవ ప్రదమైన హోదా, రాజకీయ అనుభవం, ఐదు పదుల వయస్సు దాటిన ఓ టీడీపీ నేత బుద్ధి వక్రీకరించింది. అధికార పార్టీలో గుర్తింపు కలిగిన ఈ నేతకు వ్యాపార పరంగా, కౌన్సిల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ గుర్తింపు ఉంది.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈయన రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులో ఓ యువతి నగ్నంగా నృత్యం చేస్తున్న అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. ఈ గ్రూపులో మున్సిపల్ చైర్‌పర్సన్ సహా మహిళా కౌన్సిలర్లు ఉండటంతో మంగళవారం వీరంతా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ వాట్సాప్ నంబర్లకు, ఈ–మెయిల్స్‌కు ఫిర్యాదు చేశారు.