పాలకులకు గడ్డుకాలమే | It was dificult to rulers | Sakshi
Sakshi News home page

పాలకులకు గడ్డుకాలమే

Published Sat, Apr 9 2016 3:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

పాలకులకు గడ్డుకాలమే - Sakshi

పాలకులకు గడ్డుకాలమే

టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం

 సాక్షి, హైదరాబాద్: పాలకులకు ఈ ఏడా ది గడ్డుకాలమేనని ప్రముఖ పండితుడు శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన శ్రీ దుర్ముఖి నామ ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. వృశ్చిక రాశిలో కుజుడు, శని కలసి ఉంటాయని, అందువల్ల పాలకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అప్రియమైన మాటలు మాట్లాడేవారిని దుర్ముఖులుగా పేర్కొంటారని, అందుకే ఆచితూచి వ్యవహరించాలన్నారు.

సంవత్సర అధిపతి రుద్రుడు కాబట్టి మంచిచేసే వారికి మంచి జరుగుతుందన్నారు. వర్షాలు కురిసి పాడిపంటలు బాగుంటాయన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని ఆరాధించాలని శంకరమంచి శివసాయి శ్రీని వాస్ వివరించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి సుజనా చౌదరి,  సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అమరనాథ్ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement