మంత్రి పదవి ఇస్తామన్నందుకే పార్టీ మారుతున్నానంటున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. బాబు ఆదేశాల మేరకు ఓటుకు కోట్లు పంచుతూ దొరికిన రేవంత్ (ఫైల్)
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఓటుకు వెలకట్టి కొనుగోలు చేయడం భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. ఒక పార్టీతరపున ఎన్నికైన వ్యక్తిని ప్రలోభాల ఎరతో మరో పార్టీలోకి తీసుకోవడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం నేరం. రెండు సందర్భాల్లో రెండు రాష్ట్రాల్లో... ఈ రెండు నేరాలకు పాల్పడుతూ ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయిన దోషి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ డబ్బు సంచులతో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సెల్‌ఫోన్ సంభాషణలు బట్టబయలయ్యాయి. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పదవులతో ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయించేలా చేశారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా కార్యకర్తలకు చెబుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
దొంగతనాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్ గా దొరికిన దొంగలకు శిక్షలు పడే పరిస్థితి లేకుంటే దేశంలో శాంతి–భద్రతలు మృగ్యమై అరాచకం తాండవిస్తుంది. అలాగే చంద్రబాబు నేరాలకు సాక్ష్యాలున్నా శిక్ష పడకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే, ఇక డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసిన వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇలా దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో ఎన్నికైన ప్రభుత్వాల పాలన ‘ధనస్వామ్యం’ అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఈ ధనస్వామ్యపాలనకు ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి కన్నా ధనార్జన పైనే సహజంగా దృష్టి ఉంటుంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్యం బదులు.. ధనం చేత , ధనం కొరకు, ధనమే ఎన్నుకునే ధనస్వామ్య ప్రమాదాన్ని ప్రతిఘటించడం. ప్రజాస్వామ్య ప్రేమికుల కర్తవ్యం.
ఓటుకు కోట్లు నుంచి గిడ్డి వరకూ ఎన్నో సాక్ష్యాలు...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడం కోసం తెలుగుదేశం అధినేత రంగంలోకి దిగారు. రేవంత్‌రెడ్డిని పురమాయించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభపెట్టేం దుకు ప్రయత్నించారు. మా బాస్‌తో మాట్లాడి నిర్ధారించుకోండి అని రేవంత్‌రెడ్డి చెప్పగా స్వయంగా స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణలు జరిపారు. స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయారు. రేవంత్ వీడియో, చంద్రబాబు ఆడియో టేపులు బయటప డ్డాయి. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీలో అన్ని రంగాలనూ అవినీతి మయం చేసిన బాబు ఆ అవినీతి డబ్బుతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరతీశారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు, మంత్రి పదవులు, కాంట్రాక్టులు, కమీషన్లు ఎరచూపి ఇప్పటివరకు 23 మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పారు. అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నారని చంద్రబాబు చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లేనని పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి నపుడే స్పష్టమయ్యింది. ఎమ్మెల్యేల ఫిరాయిం పుల వెనక మాస్టర్‌మైండ్ చంద్రబాబేనని, ఫిరాయింపులకు కారణం పదవులు, డబ్బు, కాంట్రాక్టులు, కమీషన్ల వంటి ప్రలోభాలేనని తాజాగా గిడ్డి ఈశ్వరి ఉదంతం రుజువు చేసిం ది. పార్టీ ఫిరాయించడానికి ముందు కార్యక ర్తలతో మాట్లాడుతూ గిడ్డి ఈశ్వరి ఈ ప్రలో భాల పర్వాన్ని స్పష్టంగా బయటపెట్టారు. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతోందని, మంత్రికి ఉండే అధికా రాలన్నీ ఉంటాయని, ఏడాది పదవిలో ఉంటాం కనుక అనేక పనులు చేసుకునే అవ కాశం కల్పిస్తారని గిడ్డి ఈశ్వరి చెబుతున్న వీడి యో ఫుటేజ్ బయటపడింది. ఇవన్నీ బాబు దోషి అని రుజువు చేస్తున్న సాక్ష్యాలే.
ఇవిగో మరికొన్ని సాక్ష్యాలు..
‘పార్టీ ఫిరాయిస్తే నాకు రూ.20 కోట్లు ఇస్తామన్నారు.’అని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆ మధ్య విలేకరుల సమా వేశం పెట్టిమరీ వివరించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి ఫిరాయించారు. ‘నాకు డబ్బు ఇవ్వలేదు కానీ మంత్రి పదవి ఇస్తామన్నా రు.’అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలుగుదేశంలోకి ఫిరాయించిన తర్వాత బయ టపెట్టారు. తాజాగా తెలుగుదేశం మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో ఓ పెద్ద తలకాయ కోసం ‘అన్ని రకాలు’గా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అదే జరిగితే ఇక వైఎస్సార్‌సీపీ ఖాళీయేనని ఆయన సెలవిచ్చారు. ఇవన్నీ సాక్ష్యాలు కావా? చంద్రబాబు దోషి అని రుజువు చేయడం లేదా?
చట్టాలకు తూట్లు పొడుస్తూ..
భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఓటుకు వెలకట్టి కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అలాంటిది ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరమాడి మరీ కొనుగోలు చేయడం ఎంత నేరం? ప్రజాస్వామ్యమంటే గౌరవమున్న వారు చేసే పనేనా ఇది. ఈ చట్టంలో ప్రజా ప్రతినిధులకు ఉండాల్సిన అర్హతలేమిటో చాలా స్పష్టంగా వివరించింది. అలానే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేసే లక్షణాలేమిటో కూడా అంతే స్పష్టంగా వివరించింది. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ అనర్హత వేటుకు అర్హులు అని స్పష్టంగా వివరించింది. డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు తీసుకుని పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లు కాదా.. ఎమ్మెల్యేల సంగతలా ఉంటే.. వారికి అవన్నీ ఎరవేసి ప్రలోభ పెట్టి పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలకు ఏ పేరు పెట్టాలి? గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఇలాంటి నీతిబాహ్యమైన, చట్టవిరు ద్ధమైన పనులకు పురికొల్పడం, స్వయంగా పాల్గొనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సాక్ష్యాలతో సహా దొరికిపోతూ ఇంకా పదవి లోనే కొనసాగడాన్ని ఏ పేరుతో పిలవాలి?
ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం....
సీఎం స్థాయి వ్యక్తి చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఆడియో – వీడియో టేపులతో సహా దొరికినా పదవిలోనే కొనసాగ డం, ఏ శిక్షా పడకపోవడం ప్రజాస్వామ్య మనుగడకు విఘాతంగా పరిణమిస్తుందని విశ్లేషకు లంటున్నారు. ఇలాంటి నేరాలు చేసినా శిక్ష పడక పోతే ఇక సొమ్ములున్నవారంతా ఓట్లను కొని ఎమ్మెల్యేలు అవుతారు. ఆపై వారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవారు ఆ తర్వాత ప్రజా సంక్షేమానికి గానీ, రాష్ట్రాభివృద్ధికి గానీ, దేశాభివృద్ధికి గానీ పనిచేయాలనుకుంటారా? సొమ్ములు సంపాదించుకోవడం అన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేయాలనుకుంటారు. ఈ పరిస్థితులకు దారితీసే ప్రమాద కర పోకడలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. ఫిరాయింపులు, కొను గోళ్లు, బేరసారాలతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయమిది. ఈ నేరగాళ్లకు శిక్షలు పడకపోతే.. మన రాష్ట్రంలో ఇక ప్రజా స్వామ్య మనుగడకు ఇది పూర్తిస్థాయి ప్రమా దంగా పరిణమించే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వెనక పదవులు, డబ్బు వంటి ప్రలోభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి సాక్ష్యాలతో బయటపడుతున్న ఈ ఉదంతాలపై తగిన చర్యలు తీసుకోకుంటే ఇవి రానురాను ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకపోయినా అధికారంలో ఉన్నవారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలనుకోవడం అనైతికం.
–పి. మధు, రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం
అనైతికం.. రాజ్యాంగ విరుద్ధం..
పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు మంత్రి పదవులివ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయడమో, వారంతట వారు రాజీనామా చేయడమో జరగాలి కానీ అవేవీ జరక్క పోగా పదవులలో ప్రతిష్టించడం సరికాదు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ప్రలోభాలకు సంబంధించి బయటపడుతున్న సాక్ష్యాలపై తగిన దర్యాప్తు జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి.
– కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఎలా..?
ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే విరుద్ధం. అధికారం ఉంది కదా అని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడం, రాజీనా మా చేయించకుండా కొనసాగించడం అనైతికం. రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన వారే వాటిని అతిక్రమిస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి? రాజ్యాంగ వ్యవస్థలను నడపాల్సిన స్పీకర్, గవర్నర్ వంటి వ్యక్తులే ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమేముంది? దీనికి అంతమెక్కడ?
–డాక్టర్ డి. నర్సింహారెడ్డి, రాజకీయ విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment