ప్రజాస్వామ్యాన్ని దగా చేశారు: ఎర్రబెల్లి, రావుల
హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని టీడీపీ విమర్శించింది. ఏడాది పాటు కేసీఆర్ అస్తవ్యస్త పాలన, అప్రజాస్వామిక విధానాలపై ప్రజల తరఫున చార్జిషీటు విడుదల చేసినట్లు ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోవడం, నిరంకుశ పరిపాలన, రాజకీయంగా అనైతిక అక్రమాలు వంటి అంశాలతో చార్జిషీటు రూపొందించామన్నారు. కేసీఆర్ పాలన పూర్తిగా ఆపరేషన్ ఆకర్ష్‌గా నడిచిందని, భూములను అమ్మి సొంత వారికి కట్టబెట్టే ప్రక్రియ సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా దగా చేశారని మండిపడ్డారు.
రేవంత్‌ను పరామర్శించిన నేతలు: ఓటుకు నోటు స్కాంలో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ నాయకులు కలిసి పరామర్శించారు. పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు రేవంత్‌తో మాట్లాడారు.
కేసీఆర్‌పై టీడీపీ చార్జిషీటు
Published Wed, Jun 3 2015 1:46 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM
Advertisement