స్వైన్‌ఫ్లూ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్నుంచి ప్రజల దృష్టిని పక్కదారిపట్టించేందుకేసాగర్...
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్నుంచి ప్రజల దృష్టిని పక్కదారిపట్టించేందుకేసాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ సమస్యపై ఏపీ తప్పుందని తేలితే కేంద్రం వద్దకు వెళ్దామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై నెపం పెడితే ప్రజలు సహించరన్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన తలసాని, తుమ్మలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని మంత్రిపదవులు ఇవ్వడంతో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ప్రశ్నించారు.