ఆయనెవరు?
రాజధానిలో భూములు కొనటం కంటే ఇతర ప్రాంతాల్లో దృష్టి సారించటం బెటరని భావించారట. అలా అనుకున్నదే తడవుగా ఖండాలు దాటి భూములు కొనుగోలు, అమ్మకాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారట. అందులో భాగంగా ఆస్ట్రేలియాలో ఒకేసారి నాలుగొందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. ఆ భూమి విలువ సుమారు ఆరొందల కోట్లు ఉంటుందట. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంత పెద్ద మొత్తం వెచ్చించి ఆయన భూములు కొనుగోలు చేసిన విషయం మెల్లగా బయటకు పొక్కింది. అయితే పార్టీ ముఖ్యులకు మాత్రమే ఈ విషయం తెలియటంతో వారు ఇదే విషయాన్ని నెమ్మదిగా తమ అలవాటులో భాగంగా లీక్ చేశారు. అయితే ఆయన పేరు మాత్రం బైటకు చెప్పలేదు. ఆయన జిల్లా పేరు మాత్రం వెల్లడించారు. దీంతో ఇంతకు ఆ నేత ఎవరంటూ పార్టీ నేతలు ఎన్‌టీఆర్ భవన్‌లో చర్చించుకుంటున్నారు.