
మీడియాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద మీడియా ప్రతినిధులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణం నుంచి లైవ్లు ఇవ్వొద్దంటూ వాళ్లు మీడియాను అడ్డుకున్నారు. చంద్రబాబుతో పాటు మరికొందరికి కూడా తెలంగాణ ఏసీబీ వర్గాలు నోటీసులు ఇవ్వొచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలను వివరించేందుకు, టీడీపీ నాయకుల స్పందనలను తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి ఎలాంటి ప్రత్యక్ష ప్రసారాలు చేయద్దని కార్యకర్తలు వాళ్లు అడ్డు తగిలారు.