
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృభిస్తోంది. గత వారం రోజులుగా స్వైన్‌ఫ్లూ బారిన పడి పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. ఆరేళ్ల చిన్నారికి స్వైన్‌ఫ్లూ సోకినట్టుగా ఆదివారం వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆ పాపను కర్ణాటకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడంతో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు భయాందోళ చెందుతున్నారు. దీంతో వైద్యులు కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం, వి కోట మండలాల్లో స్వైన్‌ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment