ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులు | telangana-students-protest-at-ntr-trust-bhavan-against-polavaram-ordinance | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 14 2014 2:56 PM | Last Updated on Thu, Mar 21 2024 5:48 PM

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో ఆర్డినెన్స్ సవరణను కేంద్రం ఆమోదించడంపై తెలంగాణ వాదుల నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మొన్న బీజేపీ కార్యాలయంపై దాడికి దిగిన తెలంగాణ ఆందోళన కారులు.. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. సోమవారం తెలంగాణ విద్యార్థి సంఘాలు టీడీపీ ట్రస్ట్ భవన్ ఎదుట భారీ నిరసన చేపట్టాయి. ఓ దశలో ఎన్టీఆర్ భవన్ లో కి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement