దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి | should be given special package to the development of dalits | Sakshi

దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

Published Thu, Jun 5 2014 1:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి - Sakshi

దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర నిర్మాణంలో కీలకమైన దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బేతాళ శరత్‌బాబు పేర్కొన్నారు.

 హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర నిర్మాణంలో కీలకమైన దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బేతాళ శరత్‌బాబు పేర్కొన్నారు.  కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు బుధవారం ఆయన విలేకరులకు తెలిపారు.
 
ఎంతోకాలంగా అణగదొక్కబడుతున్న దళిత వర్గాలకు కొత్తరాష్ట్రంలోనైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.   నూతన రాష్ట్ర నిర్మాణంలో దళితులు  సహాయ,సహాకారాలు అందజేస్తారని బాబుకు చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబును కలిసినవారిలో తనతో పాటు రామన్నగూడెం సర్పంచ్ ఢీకొల్లు రమేష్, మాల మహానాడు నాయకులు పండు నాగరాజు, బేతాళ నవీన్, కాట్రు బెనర్జీ తదితరులు  ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement