Sharath Babu
-
జీవితంలో చాలా ఎంజాయ్ చేశాను అని అంటున్న శరత్ బాబు
-
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
మంచి ప్రయత్నం చేశాం
‘‘నిర్మాత అక్షయ్ పూరి చాలా పాజిటివ్ పర్సన్. సినిమాను గ్రాండ్‌గా నిర్మించడమే కాదు.. మంచి బిజినెస్ కూడా చేసుకున్నారు. కునాల్ కోహ్లి డైరెక్ట్ చేసిన ‘హమ్ తుమ్, ఫనా’ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో తమన్నాతో కలిసి ‘నెక్ట్స్ ఏంటి’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ముఖ్య తారలుగా కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిజాయతీగా చేసిన ప్రయత్నం ‘నెక్ట్స్ ఏంటి’. సినిమాను బాగా తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాంగ్స్, ట్రైలర్ చూసిన తర్వాత కునాల్గారు తనదైన స్టయిల్లో సినిమాను ఎంత బాగా తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది’’ అన్నారు అక్షయ్ పూరి. ‘‘ఈ సినిమాపై పడ్డ ట్యాగ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి, మంచి సినిమాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. లియోన్ మంచి సంగీతం అందించారు. సందీప్, నవదీప్ చాలా కూల్ కోస్టార్స్’’ అని తమన్నా అన్నారు. ‘‘మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు రైనా జోషి. ‘‘మా చిత్రం పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్. ఈ చిత్రానికి కెమెరా: మనీష్ చంద్ర భట్, అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల, రిలీజ్: శ్రీ కృష్ణ క్రియేషన్స్. -
ఉద్యోగులవల్లే లాభాల్లోకి..
విశాఖపట్నం (పాత పోస్టాఫీసు), సాక్షి: ఉద్యోగుల సమష్టి కృషి వల్లే హిందుస్తాన్ షిప్‌యార్డ్ తిరిగి గాడిలో పడిందని సంస్థ సీఎండీ, రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్.వి.శరత్‌బాబు చెప్పారు. సంస్థ 66వ వార్షిక సాధారణ సమవేశం నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా సంస్థ ఉద్యోగులంతా కష్టపడి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి నడిపించడం అభినందనీయమన్నారు. ‘‘2015లో రూ.202 కోట్ల నష్టం వచ్చింది. అప్పుడు సంస్థ నెగెటివ్ నెట్‌వర్త్ రూ.1,231.51 కోట్లు. దాన్ని 2018లో రూ.619.43 కోట్లకు తగ్గించాం. 2014–15లో రూ.294 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2015–16లో రూ.593 కోట్లకు, 2016–17లో రూ.629 కోట్లకు, 2017 – 18లో రూ.645 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ.37.49 కోట్లుగా ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 2017–18లో రూ.69.80 కోట్లకు పెరిగిం ది. 2017–18 ఆర్థిక సంవ్సరంలో సంస్థ రూ.645 కోట్ల టర్నోవర్‌ను, రూ.20.99 కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించాం’’ అని వివరించారు. ఆశావహంగా భవిష్యత్తు భారత నేవీకి సంబంధించిన భారీ టెండర్లలో పాల్గొని రూ.2,250 కోట్ల విలువైన రెండు డైవింగ్ సపోర్ట్ నౌకలు, నాలుగు 50 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్స్ నిర్మాణానికి టెండర్‌ను దక్కించుకున్నట్లు శరత్‌బాబు తెలియజేశారు. నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నంతో రూ.10 కోట్ల విలువైన 4 పాంటూన్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో రూ.9వేల కోట్ల విలువైన 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకల నిర్మాణానికి టెండరును దక్కించుకున్నామని, 2019 డిసెంబరు నాటికి పనులు మొదలు పెడతామని చెప్పారాయన. 2020లో సంస్థకు మినీ రత్న హోదాను తెచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేస్తున్నారని చెప్పారాయన. సమావేశంలో ఈడీ (సీఅండ్‌పీ) రమేష్‌వర్మ, డైరెక్టర్ (ఎస్పీ) హేమంత్ కత్రి పాల్గొన్నారు. -
ఆయన ఎవరో కూడా తెలియదు..!
సీనియర్ నటుడు శరత్ బాబు, ప్రముఖ నటి నమిత పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్య వదంతులు గుప్పుమన్న సంగతి తెలిసిందే. శరత్‌బాబు-నమిత సహజీవనం చేస్తున్నారంటూ చెలరేగిన రూమర్లు కలకలం రేపాయి. ఇప్పటికే శరత్‌బాబు ఈ రూమర్‌ను కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా నమిత కూడా ఇది వదంతి అని తేల్చేశారు. తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అనంతరం స్వరాష్ట్రం గుజరాత్ వెళ్లిపోయిన ఆమె.. తాజాగా శరత్‌బాబుతో పెళ్లి రూమర్లపై స్పందించినట్టు తెలుస్తోంది. 'శరత్ బాబు ఎవరో నాకు సరిగ్గా తెలియదు. రూమర్లు వచ్చిన తర్వాత ఆయన గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నాకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని నేనెలా పెళ్లి చేసుకుంటాను. ఈ వార్త పూర్తి అబద్ధం. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు' అని నమిత పేర్కొన్నట్టు సమాచారం. నమితతో శరత్‌బాబు పెళ్లి అంటూ ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి గతంలో ‘సాక్షి’ ఫోన్ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే.. ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది. రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది. రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్ జర్నలిస్ట్ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్ జర్నలిస్ట్ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్ అండి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అంటూ శరత్‌బాబు గతంలో ఈ పుకారుకు ఫుల్స్టాప్ పెట్టేశారు. -
శరత్‌బాబుతో నమిత పెళ్లి?
ఎల్లా! నమితతో శరత్‌బాబు పెళ్లా? అని శుక్రవారం ఒకటే చర్చ. ఇద్దరూ లవ్‌లో ఉన్నారట అని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన వార్త కాసేపు బాగానే షికారు చేసింది. కలిసి పని చేస్తున్న ఓ హీరో–హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్త వస్తే... అందులో ఎంతో కొంత నిజం ఉంటుందనే అనుమానం రాక మానదు. నమిత ఉంటున్నది చెన్నైలో. శరత్‌బాబు ఇటు హైదరాబాద్ అటు చెన్నై.. బెంగళూరుల్లో ఉంటుంటారు. అఫ్కోర్స్ షూటింగ్స్ ఉన్నప్పుడు వేరే ప్లేసులకు కూడా వెళతారనుకోండి. ఆ సంగతి పక్కన పెట్టి ‘పెళ్లి న్యూస్’కి వచ్చేద్దాం. ‘ ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి ‘సాక్షి’ ఫోన్ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే – ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది. రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది. రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్ జర్నలిస్ట్ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్ జర్నలిస్ట్ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్ అండి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అన్నారు శరత్‌బాబు. సో.. ఈ పుకారు షికారుకి ఫుల్స్టాప్ పడిపోతుంది కదూ. నమితని చూసి ఎనిమిదేళ్లయింది ‘‘నమితను చూసి, దగ్గర దగ్గర ఎనిమిదేళ్లయింది. అప్పుడెప్పుడో ఓ తమిళ సినిమాలో మేమిద్దరం నటించాం. పేరు కూడా సరిగ్గా గుర్తు లేదు. ఇప్పుడు తనెక్కడ ఉందో కూడా తెలియదు. సడన్‌గా మా గురించి ఇలాంటి ఓ ప్రచారం మొదలు కాగానే నా ఫ్రెండ్స్ అంతా ‘యు స్టిల్ క్యారీ ది రొమాంటిక్ ఇమేజ్’ అని నవ్వారు. నేనూ హాయిగా నవ్వుకున్నా. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... శుక్రవారం నా గురించి వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అది నూటికి నూరు పాళ్లు అబద్ధం’’ అన్నారు శరత్‌బాబు. -
‘ముంపు’ ఉద్యమం మరింత ఉధృతం
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టేందుకు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సన్నద్ధమైంది. భద్రాచలంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణను పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ నాయకులు గుండు శరత్‌బాబు, వట్టం నారాయణ, ముర్ల రమేష్ ప్రకటించారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ ఈనెల 7న సరిహద్ధులను దిగ్బంధించనున్నట్లు పేర్కొన్నారు. 8న నల్లజెండాలతో నిరసన తెలపాలన్నారు. భద్రాచలంలో భవిష్యత్ ఉద్యమాల వేదికగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజానీకాన్ని సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించేలా ఆర్డినెన్స్‌ను వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఏ రీతిన ఉద్యమించారో, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ఆందోళనలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరే రోజైన జూన్ 8న ఉద్యోగులు, ఆదివాసీ సంఘాల నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపాలని కోరారు. ముంపు మండలాల్లో భవిష్యత్ కార్యాచరణ కోసం అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఎం.బి.నర్సారెడ్డి, కుంచాల రాజారామ్, కృష్ణమూర్తి, కృష్ణ, పడిసిరి శ్రీనివాస్, ఖాసిం, సొందె వీరయ్య, నాగేశ్వరరావు, మడవి నెహ్రూ, దాగం ఆదినారాయణ, అట్టం లక్ష్మణ్‌రావు, గొంది వెంకటేశ్వర్లు, సీతారాములు, జగదీష్, దాసరి శే ఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర నిర్మాణంలో కీలకమైన దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బేతాళ శరత్‌బాబు పేర్కొన్నారు. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు బుధవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఎంతోకాలంగా అణగదొక్కబడుతున్న దళిత వర్గాలకు కొత్తరాష్ట్రంలోనైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నూతన రాష్ట్ర నిర్మాణంలో దళితులు సహాయ,సహాకారాలు అందజేస్తారని బాబుకు చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబును కలిసినవారిలో తనతో పాటు రామన్నగూడెం సర్పంచ్ ఢీకొల్లు రమేష్, మాల మహానాడు నాయకులు పండు నాగరాజు, బేతాళ నవీన్, కాట్రు బెనర్జీ తదితరులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.