మంచి ప్రయత్నం చేశాం | Next Enti Movie Trailer Launch Press Meet | Sakshi
Sakshi News home page

మంచి ప్రయత్నం చేశాం

Published Thu, Dec 6 2018 12:26 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Next Enti Movie Trailer Launch Press Meet - Sakshi

లియోన్, నవదీప్, తమన్నా, సందీప్‌ కిషన్, అక్షయ్‌ పూరి

‘‘నిర్మాత అక్షయ్‌ పూరి చాలా పాజిటివ్‌ పర్సన్‌. సినిమాను గ్రాండ్‌గా నిర్మించడమే కాదు.. మంచి బిజినెస్‌ కూడా చేసుకున్నారు. కునాల్‌ కోహ్లి డైరెక్ట్‌ చేసిన ‘హమ్‌ తుమ్, ఫనా’ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో తమన్నాతో కలిసి ‘నెక్ట్స్‌ ఏంటి’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. తమన్నా, సందీప్‌ కిషన్, నవదీప్, శరత్‌ బాబు, పూనమ్‌ కౌర్, లారిస్సా ముఖ్య తారలుగా కునాల్‌ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి’. రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిజాయతీగా చేసిన ప్రయత్నం ‘నెక్ట్స్‌ ఏంటి’. సినిమాను బాగా తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాంగ్స్, ట్రైలర్‌ చూసిన తర్వాత కునాల్‌గారు తనదైన స్టయిల్‌లో సినిమాను ఎంత బాగా తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది’’ అన్నారు అక్షయ్‌ పూరి. ‘‘ఈ సినిమాపై పడ్డ ట్యాగ్స్‌ అన్నింటినీ బ్రేక్‌ చేసి, మంచి సినిమాగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు.

లియోన్‌ మంచి సంగీతం అందించారు. సందీప్, నవదీప్‌ చాలా కూల్‌ కోస్టార్స్‌’’ అని తమన్నా అన్నారు. ‘‘మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అన్నారు రైనా జోషి. ‘‘మా చిత్రం పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ లియోన్‌. ఈ చిత్రానికి కెమెరా: మనీష్‌ చంద్ర భట్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌ : సతీష్‌ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: షాజహాన్, శివప్రసాద్‌ గుడిమిట్ల, రిలీజ్‌: శ్రీ కృష్ణ క్రియేషన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement