ఎన్టీఆర్ భవన్లో జరిగేదంతా..బిజినెస్సే: తలసాని | talasani srinivas yadav takes on telugudesam party | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ భవన్లో జరిగేదంతా..బిజినెస్సే: తలసాని

Published Fri, Nov 21 2014 12:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఎన్టీఆర్ భవన్లో జరిగేదంతా..బిజినెస్సే: తలసాని - Sakshi

ఎన్టీఆర్ భవన్లో జరిగేదంతా..బిజినెస్సే: తలసాని

హైదరాబాద్ : టీడీపీపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రంగా మారందని...అక్కడ జరిగేదంతా బిజినెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ముందు సామాజిక తెలంగాణ, బీసీ సీఎం అని తెరమీదకు తెచ్చిన టీడీపీ... రెండు రాష్ట్రాల్లో బీసీలకు ఇచ్చింది 58 సీట్లేనని ఆరోపించారు. బీసీ సీఎం అని పార్టీలో చేర్చుకున్న ఆర్.కృష్ణయ్యకు కనీసం ప్లోర్ లీడర్ పదవి కూడా ఇవ్వలేదని తలసాని విమర్శించారు.

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకూ ఇక్కడే ఉంటానన్న చంద్రబాబు.... మరి కేంద్ర మంత్రిపదవి మాత్రం తెలంగాణ వారికి ఎందుకు ఇప్పించలేదని అన్నారు. దేవెగౌడను ప్రధాని చేశానంటున్న చంద్రబాబు...ఎన్టీఆర్కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారని తలసాని సూటిగా ప్రశ్నించారు.ఆర్టీఐ చట్టం ఆసరాగా టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని తలసాని ఆరోపించారు. సొంత పారట్ఈ మనుషుల నుంచే డబ్బులు వసూలు చేశారని ఆయన అన్నారు. మైహోం రామేశ్వరరావు నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తలసాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement