revanth reddy wife
-
రేవంత్‌రెడ్డి సున్నిత మనస్కుడు: గీత
-
రేవంత్‌రెడ్డి సున్నిత మనస్కుడు: గీత
హైదరాబాద్: టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలపై దూకుడు తగ్గించరని ఆయన భార్య గీత స్పష్టం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన రేవంత్‌రెడ్డికి మంగళవారం హైకోర్టు బెయిల్ మంజురు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో గీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త రేవంత్‌కు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకున్నామని కానీ వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయని మాత్రం ఊహించలేదన్నారు. రేవంత్ దూకుడుగా కనిపించిన.. చాలా సున్నితమైన మనిషి అని చెప్పారు. కష్టకాలంలో పార్టీ అధినేతతో సహా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి గీత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ వివాహం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా లేరని గీత గుర్తు చేసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి గత నెలలో తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు బెయిల్ ముంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌కు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. -
చంద్రబాబు ఇంటికి రేవంత్ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. తమ కుమార్తె నైమిశ రెడ్డి వివాహ నిశ్చితార్థానికి రావాలని చంద్రబాబు కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. కాగా, కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.