
చంద్రబాబు ఇంటికి రేవంత్ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. తమ కుమార్తె నైమిశ రెడ్డి వివాహ నిశ్చితార్థానికి రావాలని చంద్రబాబు కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ఆహ్వానించారు.
రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. కాగా, కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.