పవన్‌కు వంగా గీత స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Pithapuram Clash: Vanga Geetha Satires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ వ్యాఖ్యలకు వంగా గీత స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Wed, Mar 20 2024 9:15 AM | Last Updated on Wed, Mar 20 2024 11:05 AM

Pithapuram Clash: Vanga Geetha Satires On Pawan Kalyan - Sakshi

సాక్షి, కాకినాడ: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో.. తనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 

2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్‌సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్‌ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్‌ తాజాగా స్పందించారు. ‘‘నేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారామె. ‘2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్‌ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్‌ సమక్షంలోనే ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement