జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా పట్టణానికి చెందిన సంఘ సేవకురాలు,
శ్రీకాకుళ ం కల్చరల్: జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా పట్టణానికి చెందిన సంఘ సేవకురాలు, లైంగిక వేధింపుల నివారణ కమిటీ చైర్‌పర్సన్ యార్లగడ్డ గీతను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదంతో జువైనల్ వెల్ఫేర్, బాలల సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలలో జువైనల్ జస్టిస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులను నియమించారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన సెలక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పలువురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించగా, వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారు.
బాలనేరస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వారి ప్రవర్తనలో మార్పుతేవడం, వారి జీవన విధానాన్ని మంచి మార్గంలో పెట్టేలా చేయడం జువైనల్ సభ్యుల బాధ్యత. ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతను అందరి సహకారంతో సక్రమంగా నిర్వహిస్తానని గీత తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా మల్లేశ్వరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునికి రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును నియమించింది. వీధిబాలలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను అందరి సహకారంతో నిర్వహిస్తానని తెలిపారు.