Juvainal Justice Board
-
43 ఏళ్లు జైలులో మగ్గి ‘నిర్దోషి’గా విడుదల
పాట్నా: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే? జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్‌లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్ 148, 307ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ పెండింగ్‌లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ రాజేశ్ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్‌లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా గీత
శ్రీకాకుళ ం కల్చరల్: జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా పట్టణానికి చెందిన సంఘ సేవకురాలు, లైంగిక వేధింపుల నివారణ కమిటీ చైర్పర్సన్ యార్లగడ్డ గీతను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదంతో జువైనల్ వెల్ఫేర్, బాలల సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలలో జువైనల్ జస్టిస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులను నియమించారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన సెలక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పలువురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించగా, వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారు. బాలనేరస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వారి ప్రవర్తనలో మార్పుతేవడం, వారి జీవన విధానాన్ని మంచి మార్గంలో పెట్టేలా చేయడం జువైనల్ సభ్యుల బాధ్యత. ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతను అందరి సహకారంతో సక్రమంగా నిర్వహిస్తానని గీత తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా మల్లేశ్వరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునికి రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును నియమించింది. వీధిబాలలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను అందరి సహకారంతో నిర్వహిస్తానని తెలిపారు.