తీవ్ర రక్తహీనత కారణంగా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని గురువారం మృతి చెందింది. కురుపాం మండలం
పార్వతీపురం టౌన్: తీవ్ర రక్తహీనత కారణంగా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని గురువారం మృతి చెందింది. కురుపాం మండలం ద్రాక్షణి గ్రామానికి చెందిన బిడ్డిక గీత(20)అనే విద్యార్థిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రి లో నర్సింగ్ శిక్షణ పొందుతోంది. వచ్చే ఆగస్టు నెలలో కోర్సు పూర్తి చేసుకోనున్న గీత తీవ్ర అస్వస్థత కారణంగా రెండు నెలలుగా స్వగ్రామం లోనే ఉంటోంది. గిరిజన గ్రామం కావడం పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడింది. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. తోటివారి చేయూత: ఏరియా ఆస్పత్రిలో శిక్షణ పొందుతూ మృతి చెందిన గీత విషయం తెలుసుకున్న సహోద్యోగులు అందరూ కొంత మొత్తాన్ని ఆమె కుటుంబానికి వితరణగా అందచేశారు. మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు.