మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు | passengers pushes woman TC out of moving train | Sakshi
Sakshi News home page

మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు

Published Fri, Jul 18 2014 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

passengers  pushes  woman TC out of moving train

హైదరాబాద్ :  హైదరాబాద్ హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం దారుణం జరిగింది. టికెట్ అడిగినందుకు ఓ మహిళా టీసీని ...దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో గాయపడిన టీసీ గీతను చికిత్స నిమిత్తం మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిని జరిమానా కట్టమన్నందుకు దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గత నెల్లో కేరళ ఎక్స్ప్రెస్ లో ఇటువంటి సంఘటనే జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్రయాణికుడికి జరిమానా రాసిన కాజీపేట రైల్వేస్క్వాడ్‌గా పనిచేస్తున్న టికెట్ కలెక్టర్ విజయ్‌కుమార్ ను నలుగురు దుండగులు కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement