mettuguda
-
Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్‌ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్‌ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్‌పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్‌లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్‌లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. -
కనుమరుగవుతున్న సికింద్రాబాద్ రైల్వే కాలనీలు.. అప్రోచ్ రోడ్లు మూసివేత
రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దశాబ్దాల కాలంగా...సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.శిథిలావస్థకు చేరడంతో.... దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. రహదారుల మూసివేతలు పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.ఇబ్బంది పడుతున్న ప్రజలు రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులుఅనుమతిస్తే డంపింగ్యార్డులుగా మారుతున్నాయి : అధికారులు రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు. -
మెట్టుగూడ వద్ద రైలులో మంటలు..
-
హైదరాబాద్: మెట్టుగూడ వద్ద రైలులో మంటలు
హైదరాబాద్, సాక్షి: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఆగి ఉన్న ఓ రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ భోగీల్లోంచి దట్టమైన మంటలు, పొగ చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు. -
Hyderabad: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా
సాక్షి, హైదరాబాద్: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా పరుగులు తీస్తోంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న ఖరీదైన భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాం కాలంలోనే రైల్వేల కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల నివాసాల కోసం సికింద్రాబాద్‌లోని అనేక చోట్ల రైల్వేకు విలువైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములను నిరర్థక ఆస్తుల ఖాతాలో చేర్చి అతి తక్కువ మొత్తానికి బడా రియల్ సంస్థలు, భవన నిర్మాణ సంస్థలకు ధారాదత్తం చేయడం పట్ల ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు రైల్వే భూములను లీజుకు ఇవ్వడంలో రైల్వేకు, ప్రైవేట్ సంస్థలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ నివాస సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే రీబిల్డింగ్ పేరిట ఉద్యోగుల క్వార్టర్స్ భవనాలను కూల్చివేయడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 21 ఎకరాలపై రూ.200 కోట్లు.. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న చిలకలగూడ రైఫిల్ రేజ్ క్వార్టర్స్, మెట్టుగూడ రైల్వే కల్యాణ మండపానికి సమీపంలో ఉన్న మరో విలువైన స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఈ రెండు చోట్ల కలిపి దక్షిణమధ్య రైల్వేకు సుమారు 21 ఎకరాల భూమి ఉంది. చిలకలగూడలో ఉన్న 18 ఎకరాల స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనిపై రూ.170 కోట్లు, మెట్టుగూడలోని మరో 3 ఎకరాలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.30 కోట్ల చొప్పున లభించనున్నట్లు అంచనా. ► ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ఏర్పడిన సంగతి తెలిసిందే. రైల్వే స్థలాలను సేకరించి బడా నిర్మాణ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఆర్ఎల్డీఏ ప్రణాళికలను రూపొందించింది. మొదట్లో వ్యాపార, వాణిజ్య భవనాల కోసం మాత్రమే లీజుకు ఇవ్వాలని భావించారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. ఈ భూములను అతి తక్కువ ఆదాయానికి ఏకంగా 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ► మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ భూమిపై రైల్వేకు లీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా కేవలం రూ.200 కోట్లు మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు ప్రైవేట్ సంస్థలు అతి తక్కువ భూమిలో వేల కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుండగా రైల్వే భూములను మాత్రం అతి తక్కువ ఆదాయానికి లీజుకు ఇవ్వడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పైగా గతంలో లీజు కాలపరిమితి కేవలం 49 ఏళ్లు ఉంటే ఇప్పుడు దానిని 99 ఏళ్లకు పెంచడాన్ని కూడా ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రైవేట్ సంస్థలు రైల్వే ఆస్తులను కొల్లగొట్టడం మినహా మరొకటి కాదని ఎంప్లాయీస్ సంఘ్ నేత ఒకరు తెలిపారు. ► ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థకు ఈ భూములను కేటాయించడంతో ఉద్యోగుల క్వార్టర్స్‌ను పునర్నిర్మించనున్నట్లు లీజు ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ రైఫిల్ రేజ్ క్వార్టర్స్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండానే రెండో దశ పాత భవనాల కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (క్లిక్ చేయండి: రైళ్లిక రయ్.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!) ఒకే చోట నివాసాలు ఉండాలి.. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం అధికారులకు, ఉద్యోగులకు విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిరుపయోగ భూములను లీజుకు ఇచ్చే నెపంతో ఉద్యోగుల నివాసాలను తొలగించడం, ప్రస్తుతం ఉన్న చోట కాకుండా మరోచోట నివాసాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. (క్లిక్ చేయండి: చట్టానికి దొరక్కుండా.. ఆన్లైన్ గేమింగ్) -
భారతీయ రైల్వేలో మూడవ యూనిట్‌గా మెట్టుగూడ
సాక్షి, హైదరాబాద్: రైళ్లు నడిచే సమయంలో ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కు మారేందుకు వినియోగించే పాయింట్ మెషీన్లను దక్షిణమధ్య రైల్వే తయారు చేసింది. మెట్టుగూడలోని సిగ్నల్ అండ్ టెలికమ్యూకేషన్స్ వర్క్‌షాపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించింది. రైల్వేనెట్ వర్క్‌లో కీలకమైన పాయింట్ మెషిన్లను రైళ్లు ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కు సజావుగా మారేందుకు, ఈ క్రమంలో సంబంధిత పాయింట్లను సురక్షితంగా లాక్ చేసేందుకు వినియోగిస్తారు. రైళ్లు నడిచేటప్పుడు ప్రకంపనాలను నివారించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమాల లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే కృషిలో దక్షిణమధ్య రైల్వే ఈ కీలకమైన ముందడుగు వేసింది. మెట్టుగూడలోని సిగ్నల్ అండ్ టెలికమ్యునికేషన్ వర్క్‌షాప్ స్వయం శక్తితో పాయింట్ మెషిన్లను తయారు చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. 143 ఎంఎం, 220 ఎంఎం పాయింట్ మెషిన్లను ఇక్కడ తయారు చేయడంతో పాటు సరఫరా చేసేందుకు అనుమతి లభించింది. పాయింట్ మెషీన్ల వినియోగంలో రైల్వేలు స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశం లభించిందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా చెప్పారు. ఇది మూడో యూనిట్ ఇప్పటి వరకు పాయింట్ మెషిన్లను భారతీయ రైల్వేలో రెండు యూనిట్లలోనే తయారు చేస్తున్నారు. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా మెట్టుగూడ వర్క్‌షాపు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వేలో మూడవ యూనిట్‌గా గుర్తింపు పొందింది. దీని వల్ల తక్కువ ధరకు భారీగా పాయింట్ మెషిన్లు లభించనున్నాయి. క్లాంప్ లాక్ ఏర్పాటుతో పాటు ట్రాక్‌ల వేగం పెంచేందుకు అవకాశం లభిస్తుంది. మెట్టుగూడ వర్క్‌షాపుకు సంవత్సరానికి 3,250 పాయింట్ మెషిన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దక్షిణమధ్య రైల్వే అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర జోన్లకు కూడా సరఫరా చేయవచ్చు. పాయింట్ మెషిన్ల జీవిత కాలం సాధారణంగా 12 సంవత్సరాలు లేదా 3 లక్షలసార్లు దీనిపై రైలు నడిపించవచ్చు. వీటి తయారీకి కృషి చేసిన మెట్టుగూడ వర్క్‌షాపు అధికారులు, సిబ్బందిని జనరల్ మేనేజర్ అభినందించారు. -
మద్యం మత్తులో రౌడీషీటర్ హల్చల్
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడలో రౌడీషీటర్ హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రైల్వేఉద్యోగి రాకేష్‌పై రౌడీషీటర్ భాగ్యరాజ్ దాడికి పాల్పడ్డాడు. రాకేష్‌కు తీవ్రగాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రౌడీషీటర్ భాగ్యరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపైన కూడా భాగ్యరాజ్ దాడికి యత్నించాడు. -
ఆర్టీసీ భవన్లో డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ భవనం ఇకపై తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంగా మారనుంది. మెట్టుగూడ నుంచి తార్నాకకు వెళ్లే దారిలో ఈ భవనం ఉంది. ఆర్టీసీ ఎండీ కోసం నిర్మించిన ఈ భవనం ఆర్టీసీ చైర్మన్ల నివాస భవనంగా కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కుంటుంబం కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనంలోనే నివసించారు. నాలుగేళ్ల క్రితం సీఎం హోదాలో సికింద్రాబాద్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇదే భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పట్లోనే ఎక్సైజ్ మంత్రి హోదాలో పద్మారావు ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని ఆలోచించారు. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స్‌కు కొంతకాలం మకాం మార్చారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావుగౌడ్ ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లడం కంటే తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలనుకున్న ఆయన నిర్ణయానికి సీఎం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తన అనుచరులతో కలిసి ఆర్టీసీ భవనాన్ని సందర్శించారు. నీల ప్రభాకర్, ఓడియన్ శ్రీనివాస్, సుంకు రాంచందర్, అశోక్‌గౌడ్, శైలేందర్, మంత్రి తనయుడు రామేశ్వర్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత చందు గంగపుత్ర పాల్గొన్నారు. -
మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్,ముగ్గురు మృతి
-
హైదరాబాద్ మెట్టుగూడలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మెట్టుగూడలో రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్టుగూడలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఉదయ్, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలుగా గుర్తించారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు బైక్‌పై(నంబర్ టీఎస్08 ఎఫ్టీ 6841) వెళ్తున్న యువకులు మెట్టుగూడ వద్ద మూలమలుపును సరిగా అంచనా వేయకలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన యువకులను సూర్యాపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. లుంబినీ పార్క్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. అతివేగంతో కారు యూ టర్న్ వద్ద మలుపు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నీళ్లలో ఉన్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మెట్టుగూడ వద్ద కారులో మంటలు
-
మెట్టుగూడ వద్ద కారులో మంటలు
హైదరాబాద్: మెట్టుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి ప్రయాణికులు, డ్రైవర్ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది క్షణాల్లోనే మంటలు పూర్తిగా కారును వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో ఆ మార్గంలో వాహనరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంజిన్ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
హైదరాబాద్‌లో ‘మెట్రో’ రైలు రెడీ
-
మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు
హైదరాబాద్ : హైదరాబాద్ హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్లో శుక్రవారం దారుణం జరిగింది. టికెట్ అడిగినందుకు ఓ మహిళా టీసీని ...దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో గాయపడిన టీసీ గీతను చికిత్స నిమిత్తం మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిని జరిమానా కట్టమన్నందుకు దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్ లో ఇటువంటి సంఘటనే జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్రయాణికుడికి జరిమానా రాసిన కాజీపేట రైల్వేస్క్వాడ్‌గా పనిచేస్తున్న టికెట్ కలెక్టర్ విజయ్‌కుమార్ ను నలుగురు దుండగులు కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.