
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడలో రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో రైల్వేఉద్యోగి రాకేష్‌పై రౌడీషీటర్ భాగ్యరాజ్ దాడికి పాల్పడ్డాడు. రాకేష్‌కు తీవ్రగాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రౌడీషీటర్ భాగ్యరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపైన కూడా భాగ్యరాజ్ దాడికి యత్నించాడు.