
నటిగా దర్శకుడి తల్లి
కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఓ హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు.
పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత.. ఫిదా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత.. తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు.. గీతగారి కొడుకే తరుణ్ అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.