క్లాస్ సినిమాలను తీస్తూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయన మార్క్‌ను కనపడేలా చిత్రాన్ని తెరకెక్కించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. గతేడాది ఫిదాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో ప్రాజెక్టును చేపట్టలేదు. అయితే రీసెంట్‌గా తన కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు.
మళ్లీ కొత్తవారితో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో ఓ మంచి ప్రేమకథా చిత్రంగా మలచబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment