ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..! | Sekhar Kammula offers role in life is beautiful to Sai Pallavi | Sakshi
Sakshi News home page

ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!

Published Sat, Aug 12 2017 1:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!

ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!

ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటి. తొలి సినిమాలోన తన నటనతో మంచి మార్కులు సాధించి వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. అయితే ఈ బ్యూటీని చాలా రోజుల కిందటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు, దర్శకుడు శేఖర్ కమ్ముల.

తన దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించాడట శేఖర్. అయితే అప్పుడు సాయి పల్లవి ఎమ్బీబీయస్ చదువుతుండటంతో ఆ సినిమా చేసేందుకు సాయి పల్లవి అంగీకరించలేదు. తన కథలకు సాయి పల్లవి లాంటి నటి అయితే కరెక్ట్ అని భావించిన శేఖర్ మరోసారి ఫిదా కోసం సాయి పల్లవిని సంప్రదించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ గా మారిపోయింది ఈ మల్లార్ బ్యూటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement