పాకిస్తాన్‌లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తుపడుతుందని వారంటున్నారు. ఇటీవల టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలలో గీత అంశం విస్తృతంగా ప్రచారమవుతుండటంతో వాటిని ఈ దంపతులు చూశారు. 2006లో తప్పిపోయిన తమ కూతురు రాణియే ఆ బాలిక అని వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. గత 13 ఏళ్లుగా పాక్‌లోని ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో గీత ఉంటుందన్న సంగతి తెలిసిందే.