
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భార్య లత అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆమె గురించి గొప్పగా చెప్పారు రజినీ. ఆమె వచ్చాక తన జీవితమే మారిందని పలు మార్లు చెప్పిన సూపర్‌స్టార్.. తాజాగా మరోసారి భార్య లతకు, ఆమెను పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. జీవితాంతం వీరిద్దరికి రుణపడి ఉంటానన్నారు.
‘లత నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఆమెను చూసే క్రమశిక్షణ నేర్చుకున్నాను. బస్సు కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజు మద్యం సేవించేవాడిని. సిగరెట్లు తాగేవాడిని. ఎక్కువగా మంసాహారం తినేవాడిని. ఈ మూడు అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు.
నా భార్య లత తన ప్రేమతో నన్ను ఆ చెడు అలవాట్లకు దూరం చేసింది. ఆమె వల్లే నేను ఇప్పుడు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment