
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లిన రజనీ.. తన యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారు.
(ఇదీ చదవండి: మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు)
నేడు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రజనీకాంత్ కలవనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమాను తలైవా చూడనున్నారు. అందులో భాగంగా రజనీ ఇప్పటికే లఖ్‌నవ్ చేరుకున్నారు. దేవుడి దయ వల్ల సినిమా మంచి విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
జైలర్ సినిమాను ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ కూడా ఈ సినిమా చూసిన విషయం తెలిసిందే. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, తమన్నా, సునీల్, కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే 'జైలర్' రూ.450 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఫైనల్‌గా రూ.600 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
(ఇదీ చదవండి: లైన్‌లో నలుగురు.. మెగాస్టార్ దారెటు.. బాసూ బీ కేర్‌ఫుల్!)
Comments
Please login to add a commentAdd a comment