సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడీయం మాజీ చైర్మన్, సినీ పాటల రచయిత, కవి పులమైపిత్తన్(86) అనారోగ్యంతో బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామి నివాళులరి్పంచారు. తమిళ సినీ రంగంలో దివంగత సీఎం ఎంజీఆర్ నటించిన అనేక హిట్ చిత్రాలకు గేయ రచయితగా పనిచేసి పులమైపిత్తన్ తెర మీదకు వచ్చారు. అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఎంజీఆర్ వెన్నంటి నడిచారు. వీరిద్దరి మధ్య 22 ఏళ్ల పరిచయం ఉంది.
చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం.. అందరూ యువకులే
ఆ పార్టీ ప్రిసీడీయం చైర్మన్‌గా, గేయ రచయితగా గుర్తింపు పొందారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి మెప్పును సైతం పొందారు. ఎమ్మెల్సీగా ప్రజా సేవలో ఉంటూనే, శివాజీ గణేషన్, కమల్, రజనీకాంత్ వంటి నటుల చిత్రాలకు అనేక సూపర్ హిట్ పాటల్ని అందించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈనెల 1న ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ సమాచారంతో అన్నాడీఎంకేలో విషాదం అలముకుంది. దర్శకుడు భారతీరాజా సహా ఇతర సినీప్రముఖులు పిత్తన్ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. కాగా నీలాంకరైలోని ఆయ న నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శనార్థం భౌతిక కాయన్ని ఉంచారు. గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. పీఎంకే అధినేత రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, సంగీత దర్శకుడు ఇళయారాజా, నటుడు, మక్కల్ నీదిమయ్యం నేత కమల్‌హాసన్ తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment