రీల్‌ పైకి ఎంజీఆర్‌ రియల్‌ లైఫ్‌ | Lead finalised for MGR biopic | Sakshi
Sakshi News home page

రీల్‌ పైకి ఎంజీఆర్‌ రియల్‌ లైఫ్‌

Published Mon, Oct 30 2017 6:18 AM | Last Updated on Mon, Oct 30 2017 6:18 AM

Lead finalised for MGR biopic

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌... ఇప్పుడు ఇటు సౌత్‌ అటు నార్త్‌లో బయోపిక్‌ల (జీవితకథ) ట్రెండ్‌ నడుస్తోంది. మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్‌కి చెందిన సెలబ్రిటీల జీవిత కథలను సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించడానికి ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. బాలకృష్ణన్‌ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్‌ 8న ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రకు ఇంకా ఎవర్నీ సెలక్ట్‌ చేయలేదు. ఈ పాత్ర కోసం చిత్రబృందం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. కాగా, ‘బాహుబలి’లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్‌ టాక్‌. తెలుగులోనూ ఎన్టీఆర్‌ బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా, అటు రాజకీయరంగంలో రాణించిన ఎన్టీఆర్, ఎంజీఆర్‌ బయోపిక్‌లు ఏకకాలంలో రూపొందనుండటం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement