తలైవీ షూటింగ్‌ షురూ..! | shooting resumed by kangana for thalaivi movie after seven months | Sakshi
Sakshi News home page

తలైవీ షూటింగ్‌ షురూ..!

Oct 5 2020 2:47 PM | Updated on Oct 5 2020 4:02 PM

shooting resumed by kangana for thalaivi movie after seven months  - Sakshi

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'తలైవీ'. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. వీటికి సంబంధించి సినిమా డైరెక్టర్‌ ఏఎల్‌ విజయ్‌తో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. విజయ్‌ టాలెంట్‌ ఉన్న డైరెక్టరే కాకుండా మంచి వ్యక్తని కంగనా తెలిపింది. కంగనా పోస్ట్‌ చేసిన ఫొటోలో చీరకట్టులో కనిపించగా డైరెక్టర్‌ ఆమెకు సీన్‌ వివరిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ​ప్రదేశాలు ఉన్నా నాకు ఇష్టమైంది మాత్రం సినిమా సెట్‌ అని కంగనా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కంగనా గత కొన్ని నెలలుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన ఇంటి వద్దే ఉంటుంది.  

జయలలిత సినీ ప్రస్థానం మొదలుకొని రాజకీయా​ల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దివంగత ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలో ఈ సినిమా తెరకెక్కనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement