జెమినీ గణేషన్ బాటలో పవన్ కళ్యాణ్!
జెమినీ గణేషన్ బాటలో పవన్ కళ్యాణ్!
Published Mon, Dec 30 2013 4:09 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
టాలీవుడ్ లో రికార్డులను సృష్టించడంలో పవన్ కళ్యాణ్ తనకు తానే సాటి అనడం సందేహం అక్కర్లేదు. అయితే పెళ్లిళ్ల విషయంలో తమిళ నటుడు జెమినీ గణేషన్ ఫాలో అవుతున్నాడా అంటే అవునే చెప్పవచ్చు.
తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ కు ధీటుగా హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న జెమినీ గణేషన్ బాలీవుడ్ తార రేఖ తండ్రి. తమిళ తెరకే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన రామస్వామి గణేశన్ ఉరఫ్ జెమిని గణేశన్ ప్రముఖ నటి సావిత్రికి భర్త. ఓ దశలో ఎంజీ రాంచంద్రన్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతుంటే.. తమిళ రంగంలో 'కాదల్ మన్నన్ (కింగ్ ఆఫ్ రొమాన్స్)'గా పేరును సొంతం చేసుకున్నారు.
తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా జెమినీ గణేషన్ కింగ్ రొమాన్స్ గా మారి నాలుగు పెళ్లిళ్లతో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు. జెమినీ గణేషన్ తొలుత అలమేలును పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత పుష్పవల్లి వివాహ మాడారు. పుష్పవల్లి, జెమినీ గణేషన్ కూతురే రేఖ. తమిళ తెరపైన జెమినీ,సావిత్రిల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అయితే సావిత్రితో సాగించిన ప్రేమాయణ జెమినీ గణేషన్ మూడోపెళ్లికి దారి తీసింది. ఆతర్వాత సావిత్రితో విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. ఆతర్వాత జెమినీ గణేషన్ తన 79వ ఏట విదేశీ వనిత జూలియానా యువతిని పెళ్లాడి..కుటుంబాన్ని, స్నేహితుల్ని, సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
జెమినీ గణేషన్ జీవితంలో మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకుని అభిమానులను మీడియాను, అభిమానులను ఆశ్చర్యానికి లోను చేశారు. గతంలో పవన్ విశాఖ చెందిన నందినిని మొదట పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ....ఓ కుమారుడు పుట్టిన తర్వాత చట్టబద్దంగా వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి అకీరాతో పాటు ఓ పాప కూడా ఉన్నారు. అయితే కొంతకాలం నుండి పవన్, రేణు దేశాయ్ వేర్వేరుగా ఉంటున్నారు.
పవన్‌కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి పెళ్ళి చేసుకున్న ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్30న ఎర్రగడ్డ సబ్‌రిజిస్టార్ ఆఫీస్‌లో పవన్-అన్నా లెజ్నోవా ( డానా మార్క్స్) రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిసింది. పవన్కు రష్యన్ మోడల్ అయిన దానా మార్క్స్ తో 'తీన్‌మార్' చిత్రం సమయంలో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారంలో జెమినీ గణేషన్, పవన్ కళ్యాణ్ కు దగ్గరి పోలీకలు కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement