Anna Lezhneva
-
పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆస్తి వివరాలు
-
మహేష్‌కు పవన్ దంపతుల క్రిస్మస్ కానుక..
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా స్నేహితులు, ఆత్మీయులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక అందించారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్, అన్నా దంపతులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకుముందు కూడా పుట్టినరోజు సహా పలు సందర్భాల్లో మహేష్- పవన్‌లు ఒకరికొకరు విసెస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ దంపతులు పంపిన గిఫ్ట్‌తో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తెగ సంబర పడిపోతున్నారు. (వైరలవుతున్న పవన్ భార్య ఫోటోలు) వకీల్‌సాబ్ షూటింగ్‌తో బిజీగా గడుపుతున్న పవన్..రానా దగ్గుబాటితో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కీర్తిసురేష్ తొలిసారిగా మహేష్‌కు జోడీగా నటించనున్నారు. అనంతరం భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి మహేష్ ఓ సినిమా ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. -
షాకింగ్ లుక్‌లో పవన్ భార్య.. గుర్తుపట్టారా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా రోజుల తర్వాత ఆమె కెమెరా కంటికి చిక్కడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లెజ్నేవా ఫోటోలు ఇంతగా ట్రెండ్ అవ్వడానికి ఆమె లుక్‌యే కారణం. ఇప్పటి వరకు సాంప్రదాయబద్దంగా చీరకట్టులో కనిపించిన ఆమె తాజాగా జీన్స్, టీషర్టులో ట్రెండీగా కనిపించారు. వేషాధారణలో ఇంతగా మార్పు రావడంతో అభిమానులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆమె వెంట కొడుకు మార్క్ శంకర్ పవనోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా కూడా ఉన్నారు. వీరు ముగ్గురు హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో మీడియా కళ్లకు చిక్కారు. చదవండి: నిహారిక పెళ్లిలో.. పవన్ కళ్యాణ్ సందడి ఇద్దరు పిల్లలతో కలిసి లెజ్నేవా ముఖానికి మాస్కు ధరించి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. కాగా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ ఫోటోలలొ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన క్యూట్‌నెస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్లారు. అందుకే నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి కూడా హాజరు కాలేకపోయారని వార్తలు వినిపించాయి. అయితే క్రిస్మస్ ఇంకా ముగియకముందే ఇలా ఆకస్మికంగా ఎయిర్‌పోర్టులో కనిపించడంతో షాకింగ్‌కు గురిచేస్తోంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన లెజ్నేవా 2013లో పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్ -
‘గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’
నటి రేణూ దేశాయ్.. నటుడు పవన్ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘పవనే విడాకులు కావాలని కోరారంటూ’ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ కొందరు ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్-అన్నాలెజ్నెవా కూతురు పొలెనా ప్రస్తావన తెస్తూ రేణూ దేశాయ్ పీఆర్ టీమ్ ఆవిడ ఫేస్బుక్ పేజీలో వరుస పోస్టులు చేసింది. ‘బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తర్వాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకుల వ్యవహారం మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అన్నాలెజ్నెవా గర్భం దాల్చిన విషయం రేణూ మేడమ్‌కు తెలియదు. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత పవన్‌కు రేణూ మేడమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ మరో ఇంటర్వ్యూలో చెప్పారు’ అని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ట్రోల్ టెంప్లేట్లను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. -
కూతురి బర్త్‌డే వేడుకలో పవన్
హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన చిన్న కూతురి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో నిరంతరం బిజీగా ఉండే పవన్.. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని, వారి చిన్ని చిన్ని సంతోషాలను తీరుస్తారని మరోసారి రుజువైంది. పవన్, అన్నా లెజ్నోవాల కూతురు పొలెనా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, తన స్నేహితుల మధ్య పొలెనా కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది. తల్లిదండ్రులు పవన్, అన్నా లెజ్నోవాలు చెబుతుండగా కేక్ కట్ చేసింది. చిన్నారి పొలెనాకు ఇది 5వ జన్మదిన వేడుక అని క్యాండిల్ పై ఉంది. ఈ సందర్భంగా చిన్నారి పొలెనా దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మెగా అభిమానులు ఈ ఈవెంట్ వివరాలను రీట్వీట్ చేస్తున్నారు. ఈ వేడుక మాత్రం ఇటీవలే జరిగనట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ నటించిన 'కాటమరాయుడు' నిన్న (శుక్రవారం) విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. -
శ్రీజ పెళ్లిలో పవన్ సతీమణి..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య బెంగళూరు ఫామ్ హౌస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో ప్రముఖులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా శ్రీజ వివాహానికి హాజరు కాలేకపోయారు. అయితే పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. శ్రీజ పెళ్లి వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. పూర్తిగా భారతీయ సంప్రదాయంలో చీరకట్టుతో అన్నా ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. శ్రీజను పెళ్లి కూతురిని చేసే తతంగంలో ఆమె తళుక్కుమన్నారు. 'తీన్మార్' సినిమా సమయంలో రష్యన్ యువతి అన్నా లెజ్నోవాతో ప్రేమలో పడి పవన్ ఆమెను రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది. -
జెమినీ గణేషన్ బాటలో పవన్ కళ్యాణ్!
టాలీవుడ్ లో రికార్డులను సృష్టించడంలో పవన్ కళ్యాణ్ తనకు తానే సాటి అనడం సందేహం అక్కర్లేదు. అయితే పెళ్లిళ్ల విషయంలో తమిళ నటుడు జెమినీ గణేషన్ ఫాలో అవుతున్నాడా అంటే అవునే చెప్పవచ్చు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ కు ధీటుగా హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న జెమినీ గణేషన్ బాలీవుడ్ తార రేఖ తండ్రి. తమిళ తెరకే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన రామస్వామి గణేశన్ ఉరఫ్ జెమిని గణేశన్ ప్రముఖ నటి సావిత్రికి భర్త. ఓ దశలో ఎంజీ రాంచంద్రన్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతుంటే.. తమిళ రంగంలో 'కాదల్ మన్నన్ (కింగ్ ఆఫ్ రొమాన్స్)'గా పేరును సొంతం చేసుకున్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా జెమినీ గణేషన్ కింగ్ రొమాన్స్ గా మారి నాలుగు పెళ్లిళ్లతో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు. జెమినీ గణేషన్ తొలుత అలమేలును పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత పుష్పవల్లి వివాహ మాడారు. పుష్పవల్లి, జెమినీ గణేషన్ కూతురే రేఖ. తమిళ తెరపైన జెమినీ,సావిత్రిల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అయితే సావిత్రితో సాగించిన ప్రేమాయణ జెమినీ గణేషన్ మూడోపెళ్లికి దారి తీసింది. ఆతర్వాత సావిత్రితో విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. ఆతర్వాత జెమినీ గణేషన్ తన 79వ ఏట విదేశీ వనిత జూలియానా యువతిని పెళ్లాడి..కుటుంబాన్ని, స్నేహితుల్ని, సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జెమినీ గణేషన్ జీవితంలో మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకుని అభిమానులను మీడియాను, అభిమానులను ఆశ్చర్యానికి లోను చేశారు. గతంలో పవన్ విశాఖ చెందిన నందినిని మొదట పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ....ఓ కుమారుడు పుట్టిన తర్వాత చట్టబద్దంగా వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి అకీరాతో పాటు ఓ పాప కూడా ఉన్నారు. అయితే కొంతకాలం నుండి పవన్, రేణు దేశాయ్ వేర్వేరుగా ఉంటున్నారు. పవన్‌కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి పెళ్ళి చేసుకున్న ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్30న ఎర్రగడ్డ సబ్‌రిజిస్టార్ ఆఫీస్‌లో పవన్-అన్నా లెజ్నోవా ( డానా మార్క్స్) రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిసింది. పవన్‌కు రష్యన్ మోడల్ అయిన దానా మార్క్స్ తో 'తీన్మార్' చిత్రం సమయంలో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారంలో జెమినీ గణేషన్, పవన్ కళ్యాణ్ కు దగ్గరి పోలీకలు కనిపిస్తున్నాయి. -
పవన్ కళ్యాణ్ పెళ్లిని ధృవీకరించిన రిజిష్ట్రార్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడవ పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిష్ట్రార్ ధృవీకరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 30న పవన్ కళ్యాణ్ - ఆస్ట్రేలియా మోడల్ మోడల్ అన్నా లెజ్నెవా (డానా మార్క్స్) వివాహం జరిగినట్లు ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ తెలిపారు. ఆ తేదికి నెల రోజుల ముందు వారు ఇద్దరూ వివాహం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తాము నోటీసు జారీ చేశామని చెప్పారు. ఆ నెల రోజులలో వారి పెళ్లికి అభ్యంతరం తెలుపుతూ ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. దాంతో సెప్టెంబర్ 30న వారికి వివాహం చేసినట్లు తెలిపారు. వారిది కులాంతర వివాహమని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ హిందు అని, అన్నా లెజ్నెవా క్రిస్టియన్ అని తెలిపారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారికి వివాహం చేసినట్లు ఆయన చెప్పారు. వివాహ ధృవీకరణ పత్రంలో కొణిదల పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా అని వారి పేర్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్-లెజ్నెవా సహజీవనం చేస్తున్నట్లు ఏడాది క్రితమే బయటకు తెలిసింది. అప్పటి నుంచి వారికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వారు ధృవీకరించలేదు. ఖండించలేదు. ఇప్పుడు ఈ ధృవీకరణతో వారి సహజీవనం, మూడవ పెళ్లి నిజమేనని స్పష్టమైంది. సినీ పరిశ్రమలో నటన పరంగా సంచలనాలు సృష్టించిన పవన్, పెళ్లి - సహజీవనం విషయంలో కూడా సంచలనాలు సృష్టించారు. మూడవ పెళ్లి మరో సంచలనం. పెళ్లి - సహజీవనం- మళ్లీ పెళ్లి - మళ్లీ సహజీవనం - మళ్లీ పెళ్లి ... ఇలా సాగిపోతోంది ఆయన జీవితం. పవన్ కళ్యాణ్ మొదట విశాఖకు చెందిన నందిని అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తరువాత ‘బద్రి' చిత్రంలో తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేశారు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఆమె కూడా మొదట మోడల్‌గానే తన కెరీర్‌ను ప్రారంభించారు. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సంచలనం. అప్పట్లో సహజీవనంపైన చాలా చర్చ కూడా జరిగింది. పవన్‌తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్‌తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. రేణుదేశాయ్ దూరమైనప్పటి నుంచి పవన్ అన్నాలెజ్నెవాతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 'తీన్మార్' చిత్రంలో పవన్ పక్కన అన్నాలెజ్నెవా ఒక పాటలో నటించారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.