Christmas 2020: Pawan Kalyan and Wife Anna Lezhneva Gift to Mahesh Babu Family | మహేష్‌కు పవన్‌ దంపతుల క్రిస్మస్‌ కానుక - Sakshi
Sakshi News home page

మహేష్‌కు పవన్‌ దంపతుల క్రిస్మస్‌ కానుక..

Published Thu, Dec 24 2020 10:15 AM | Last Updated on Thu, Dec 24 2020 2:36 PM

Pawan Kalyan and wife anna   Sent Christmas Gift To mahesh Family - Sakshi

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా స్నేహితులు, ఆత్మీయులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా  పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, భార్య అన్నా లెజ్‌నేవా దంప‌తులు సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మ‌స్ కానుక అందించారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్‌, అన్నా దంపతులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకుముందు కూడా పుట్టినరోజు సహా పలు సందర్భాల్లో మహేష్‌- పవన్‌లు ఒకరికొకరు విసెస్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్‌ దంపతులు పంపిన గిఫ్ట్‌తో ఇద్దరు స్టార్‌ హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తూ తెగ సంబర పడిపోతున్నారు. (వైరలవుతున్న పవన్‌ భార్య ఫోటోలు)

వకీల్‌సాబ్‌ షూటింగ్‌తో బిజీగా గడుపుతున్న పవన్‌..రానా దగ్గుబాటితో కలిసి ఓ మల్టీ స్టారర్‌ సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఇక మహేష్‌ ప్రస్తుతం  ‘సర్కారువారి పాట’ సినిమాలో  నటిస్తున్నారు. ఈ చిత్రంతో కీర్తిసురేష్‌ తొలిసారిగా మహేష్‌కు జోడీగా నటించనున్నారు. అనంతరం  భీష్మ డైరెక్టర్‌ వెంకీ కుడుములతో కలిసి  మహేష్‌ ఓ సినిమా ప్లాన్‌  చేయనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement