‘గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ | Renu Desai Again Responded on Pawan Divorce Issue | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 11:09 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Renu Desai Again Responded on Pawan Divorce Issue  - Sakshi

రేణూ దేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌

నటి రేణూ దేశాయ్‌.. నటుడు పవన్‌ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘పవనే విడాకులు కావాలని కోరారంటూ’ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూతో హర్ట్‌ అయిన పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు ఆమెను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్‌-అన్నాలెజ్‌నెవా కూతురు పొలెనా ప్రస్తావన తెస్తూ రేణూ దేశాయ్‌ పీఆర్‌ టీమ్‌ ఆవిడ ఫేస్‌బుక్‌ పేజీలో వరుస పోస్టులు చేసింది.

‘బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తర్వాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకుల వ్యవహారం మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

అన్నాలెజ్‌నెవా గర్భం దాల్చిన విషయం రేణూ మేడమ్‌కు తెలియదు. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత పవన్‌కు రేణూ మేడమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ మరో ఇంటర్వ్యూలో చెప్పారు’ అని పీఆర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ట్రోల్‌ టెంప్లేట్లను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement