శ్రీజ పెళ్లిలో పవన్ సతీమణి.. | Pawan's Wife At Srija's Wedding | Sakshi
Sakshi News home page

శ్రీజ పెళ్లిలో పవన్ సతీమణి..

Published Sat, Apr 2 2016 4:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan's Wife At Srija's Wedding

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య బెంగళూరు ఫామ్ హౌస్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత హైదరాబాద్ లో పార్క్ హయత్‌ హోటల్లో ప్రముఖులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం 'సర్దార్ గబ్బర్సింగ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా శ్రీజ వివాహానికి హాజరు కాలేకపోయారు. అయితే పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. శ్రీజ పెళ్లి వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి.

పూర్తిగా భారతీయ సంప్రదాయంలో చీరకట్టుతో అన్నా ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. శ్రీజను పెళ్లి కూతురిని చేసే తతంగంలో ఆమె తళుక్కుమన్నారు. 'తీన్మార్' సినిమా సమయంలో రష్యన్ యువతి అన్నా లెజ్నోవాతో ప్రేమలో పడి పవన్ ఆమెను రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement