
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా రోజుల తర్వాత ఆమె కెమెరా కంటికి చిక్కడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లెజ్‌నేవా ఫోటోలు ఇంతగా ట్రెండ్ అవ్వడానికి ఆమె లుక్‌యే కారణం. ఇప్పటి వరకు సాంప్రదాయబద్దంగా చీరకట్టులో కనిపించిన ఆమె తాజాగా జీన్స్, టీషర్టులో ట్రెండీగా కనిపించారు. వేషాధారణలో ఇంతగా మార్పు రావడంతో అభిమానులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆమె వెంట కొడుకు మార్క్ శంకర్ పవనోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా కూడా ఉన్నారు. వీరు ముగ్గురు హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో మీడియా కళ్లకు చిక్కారు. చదవండి: నిహారిక పెళ్లిలో.. పవన్ కళ్యాణ్ సందడి
ఇద్దరు పిల్లలతో కలిసి లెజ్‌నేవా ముఖానికి మాస్కు ధరించి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. కాగా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ ఫోటోలలొ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన క్యూట్‌నెస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల క్రిస్‌మస్ వేడుకల కోసం రష్యా వెళ్లారు. అందుకే నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి కూడా హాజరు కాలేకపోయారని వార్తలు వినిపించాయి. అయితే క్రిస్‌మస్ ఇంకా ముగియకముందే ఇలా ఆకస్మికంగా ఎయిర్‌పోర్టులో కనిపించడంతో షాకింగ్‌కు గురిచేస్తోంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన లెజ్‌నేవా 2013లో పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment