PSPK27 Updates: Powen Kalyan Action Scene Photos Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

కుస్తీ వీరులతో ఫైటింగ్‌కు పవన్‌ కల్యాణ్‌ రెడీ

Published Wed, Feb 24 2021 1:59 PM | Last Updated on Wed, Feb 24 2021 2:47 PM

PSPK27: Pawan Kalyan Photos Goes Viral - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటేనే ప్రేక్షకులకు పండుగ. ఆయన సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా తెగ సంబరపడిపోతుంటారు. ప్రస్తుతం అతడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ యువరాణిగా నటిస్తోంది. ఈ మధ్య 17వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌ వేయించిన క్రిష్‌ ఇప్పుడక్కడ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ కొనసాగుతుండగా మల్లయోధులతో వీరోచిత పోరాటానికి రెడీ అయ్యాడట పవన్‌. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమవగా క్షణాల్లో వైరల్‌గా మారాయి. 

ఈ ఫొటోలు చూస్తుంటే భారీ దేహాలు ఉన్న మల్లయోధులతో పవన్‌ హోరాహోరీగా తలపడేటట్లు కనిపిస్తోంది. ఈ పహిల్వాన్లతో పవన్‌ కలిసిన ఫొటో ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. వజ్రాల దొంగలా కనిపించనున్న పవన్‌ గెటప్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట క్రిష్‌. ఇక ఈ సినిమాకు 'హరిహర వీరమల్లు' అనే టైటిల్‌ను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌.. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తుండగా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ కీలక పాత్ర చేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

చదవండి: పవన్‌ కల్యాణ్‌ నా గుండెల్లో ఉంటాడు: హీరో

జనగణమన: మహేశ్‌ నుంచి పవన్‌కు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement