Bobby Deol Boards Pawan Kalyan's Hari Hara Veera Mallu - Sakshi
Sakshi News home page

‘హరి హర వీరమల్లు’లో బాలీవుడ్‌ స్టార్‌.. స్పెషల్‌ వీడియో వైరల్‌

Published Sat, Dec 24 2022 12:39 PM | Last Updated on Sat, Dec 24 2022 12:49 PM

Bobby Deol Comes On Board For Hari Hara Veera Mallu - Sakshi

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.  క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సెట్‌లో మరో స్టార్‌ హీరో అడుగుపెట్టాడు.

ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement