
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. చదవండి: పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: థియేటర్‌పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం