Akira Nandan Acting With Pawan Kalyan in Hari Hara Veera Mallu - Sakshi
Sakshi News home page

Pawan Kalyan: తండ్రి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోన్న అకీరా నందన్‌

Published Tue, Oct 26 2021 7:04 PM | Last Updated on Tue, Oct 26 2021 7:53 PM

Pawan Kalyan Son Akira Nandan In Harihara Veeramallu Movie - Sakshi

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌న‌యుడు అకీరా నంద‌న్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అకీరా బ‌ర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుతార‌నే సంగ‌తి తెలిసిందే. అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ కొంతకాలంగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకీరా సినిమా, తెలుగు వెండితెర ఎంట్రీపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

చదవండి: విజయ్‌పై ఆనంద్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో మెగా అభిమానులంత పండగ చేసుకునే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అదేంటంటే అకీరా టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమైందని, తన తండ్రి పవన్‌ సినిమాతోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నాండంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏఎంరత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

చదవండి: కూకట్‌పల్లి కోర్టులో సమంతకు ఊరట

 

ఈ సినిమాలో అకీరా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని టాక్‌. కాగా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమం కాబోతోంది. అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అకీరా నందన్‌ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్‌తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్స్‌ కాగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement