జెమినీ గణేశన్‌గా..! | gemini ganesan in Title Role | Sakshi
Sakshi News home page

జెమినీ గణేశన్‌గా..!

Published Sun, Oct 4 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

జెమినీ గణేశన్‌గా..!

జెమినీ గణేశన్‌గా..!

‘లవర్ బోయ్’ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అలనాటి హీరోల్లో ‘జెమినీ’ గణేశన్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో హీరోగా ఓ రేంజ్‌లో దూసుకెళ్లిన ఆయన చనిపోయి పదేళ్లయినా, ఇప్పటికీ గుర్తుండిపోతారు. ఇప్పుడు జెమినీ గణేశన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయన పాత్రను చేసే అవకాశం యువ హీరో చేతన్ చీనూకి దక్కింది. ఇటీవల విడుదలైన ‘మంత్ర 2’లో నటించిన చేతన్ ప్రస్తుతం ‘రాజుగారి గది’, ‘చెక్‌పోస్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో జెమినీ గణేశన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కాదల్ మన్నన్ జెమిని గణేశన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న తన పుట్టినరోజుకి ఈ చిత్రం ఓ మంచి కానుక అవుతుందని చేతన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement