
మాధవన్
‘సఖి’ సినిమాతో లవర్‌బాయ్‌లా యూత్ సెన్సేషన్ అయ్యారు హీరో మాధవన్. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ తన ట్రాక్ మార్చుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు మాధవన్. అయితే ఇప్పుడు మళ్లీ ఓ లవ్ స్టోరీలో యాక్ట్ చేయనున్నారు మ్యాడీ. కొత్త దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘మారా’ చిత్రంలో రొమాంటిక్ హీరోగా దర్శనం ఇవ్వనున్నారట. ‘విక్రమ్ వేదా’లో మాధవన్ సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులోనూ జోడీగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment