బరువు తగ్గించిన బాక్సర్ పాత్ర | Madhavan plays a former boxer Muhammad Ali's life story | Sakshi
Sakshi News home page

బరువు తగ్గించిన బాక్సర్ పాత్ర

Published Mon, Nov 17 2014 11:40 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

బరువు తగ్గించిన బాక్సర్ పాత్ర - Sakshi

బరువు తగ్గించిన బాక్సర్ పాత్ర

ఏ పాత్ర చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేయడం మంచి కళాకారుడి లక్షణం. చాక్లెట్‌బోయ్ మాధవన్ ఈ కోవకే చెందుతారు. అందుకు తాజా ఉదాహరణగా త్వరలో ఆయన చేయనున్న ఓ చిత్రం గురించి చెప్పాలి. అమెరికన్ మాజీ బాక్సర్ మొహమ్మద్ అలీ జీవితానికి కొంత కాల్పనికత జోడించి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన సుధ కొంగర దర్శకత్వం వహించనున్నారు.
 
  ఇందులో అలీగా మాధవన్ నటించనున్నారు. ఇప్పటివరకు దాదాపు లవర్‌బోయ్ పాత్రలకు పరిమితమైన ఆయన ఈ శక్తిమంతమైన పాత్ర కోసం లాస్ ఏంజిల్స్‌లో కసరత్తులు చేస్తున్నారు. శారీరక దృఢత్వం, బాక్సింగ్‌లో శిక్షణ, ఓ బాక్సర్ శారీరక భాష ఎలా ఉంటుంది? అనే విషయాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు మాధవన్. అది మాత్రమే కాదు... తనను తాను ఓ బాక్సర్‌లా ఊహించుకుంటున్నారట. నడిచే తీరు, ఆలోచనా విధానం అన్నీ ఓ బాక్సర్‌లానే చేస్తున్నానని మాధవన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘లాల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement